Lady teacher suspended for making students massage her legs

Lady teacher suspended for making students massage her legs, Teacher suspended for making students massage her legs, Woman teacher suspended, Akola, Maharashtra

Lady teacher suspended for making students massage her legs, Teacher suspended for making students massage her legs

మూగ పిల్లలతో నొక్కించుకున్న పంతులమ్మ

Posted: 10/29/2013 03:52 PM IST
Lady teacher suspended for making students massage her legs

గురువులకు శిష్యులు ఎంతో విధేయతతో ఉండాలని చెబుతున్నారు. గురువులను పూజించాలి అనే సూక్తిని అక్షరాల పాటిస్తుంది ఒక బడి పంతులమ్మ. పిల్లలు తప్పు చేస్తే .. బెత్తంతో దెబ్బలు కొట్టే పంతులమ్మలను చూశాం కానీ.. బడి పంతులమ్మ తప్పే చేస్తే ఏం చెయ్యాలి? ఆమె చేసిన తప్పుకు పై అధికారులు సస్సెండ్ చేశారు. అసలు విషయం ఏమిటంటే.. మూగ, చెవిటి పిల్లలు దైవంతో సమానం అని మన పెద్దలు అంటారు. అలాంటి పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి పిల్లలకు తల్లి , తండ్రి అన్ని గురువులోనే చూసుకుంటారు. అలాంటిది ఆ టీచర్ మాత్రం .. మూగ, చెవిటి పిల్లల్ని బానిసలుగా చేసుకుంది. నిత్యం పిల్లలతో కాళ్లు నొక్కించుకుంటు.. హాయిగా.. ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని అందుకుంటుంది. అయితే ఇది మన రాష్ట్రంలో కాదులేండి.

 

ఈ సంఘటన మహారాష్ట్రలోని అకోలాలో జరిగింది. శీతల్ అవచార్ అనే ఈ ఉపాధ్యాయిని మూగ, చెవిటి విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నడుపుతున్న పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈమె కాళ్లు నొక్కించుకోవడమే కాదు.. పాఠశాల నడిచే సమయంలో నిద్రపోవడం, విద్యార్థులను వేధించడం లాంటి పనులు కూడా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 

దీన్నంతటినీ ఓ విద్యార్థి వీడియో తీసి, వాటిని స్కూలు అధికారులకు పంపడంతో మొత్తం వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. వెంటనే జడ్పీ సీఈవో అరుణ్ ఉన్హాలే ఆమెపై విచారణ జరిపించగా, ఆరోపణలన్నీ నిజమేనని తేలింది. దాంతో ఆమెను సస్పెండ్ చేశారు. అయిన ఇలాంటి పంతులమ్మలు ఇంక ఎంత మంది ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles