Congress perturbed with modi says venkaiah

Narendra Modi, BJP PM Candidate Modi, Bharatiya Janata Party, Venkayya Naidu, Congress Party, Lal Kishan Advani, RSS, Hindutva

congress perturbed with Modi says venkaiah

మోదీ పేరుతో కాంగీ కంపించింది- వెంకయ్య

Posted: 09/16/2013 05:05 PM IST
Congress perturbed with modi says venkaiah

నరేంద్ర మోదీ పేరుని ప్రధాని అభ్యర్థిగా భాజపా ఖరారు చెయ్యగానే రాజకీయ వర్గాల్లో ప్రకంపనం బయలుదేరిందని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కంపించిపోతోందని భాజపా సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు మీడియా ప్రతినిధులతో అన్నారు.  దానితో నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ అర్థంపర్థం లేని వ్యాఖ్యలను చేస్తోందని కూడా ఆయన అన్నారు.  

మోదీ గెలిస్తే ప్రజాస్వామ్యం అంతరించిపోయినట్లేనని ఒక రాజకీయ నాయకుడు వ్యాఖ్యనించారని, అసలు ప్రజాస్వామ్యాన్నే నాశనం చేసిన పార్టీ ప్రజాస్వామ్యం ప్రస్తావన తీసుకురావటం తగునా అని ఆయన ప్రశ్నించారు.  

ఆర్ఎస్ఎస్ వత్తిడితో నరేంద్ర మోదీకి భాజపా ప్రాముఖ్యతను కల్పించిందన్న వ్యాఖ్య పూర్తిగా అబద్ధమని అన్నారాయన.  హిందుత్వానికి, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదన్నారాయన.

ఇంకా, సీనియర్ నేత అద్వానీ గురించి మాట్లాడుతూ, ఆయన గురించి వ్యాఖ్యానించటం తగదని, ఆయన పార్టీకి ఎంతో సేవచేసారని, ఆయన దృష్టి కోణం ఆయనకుంటుందని అన్న వెంకయ్యనాయుడు అద్వానీ మోదీ అభ్యర్థిత్వాన్ని ఎంత మాత్రం వ్యతిరేకించలేదని, శాసన సభ ఎన్నికల తర్వాత ఆ పని చెయ్యవచ్చు కదా ఇంత ముందే ఎందుకన్నది మాత్రమే ఆయన ఉద్దేశ్యమని అన్నారు.  

వెంకయ్యనాయుడు పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడుతూ, ఎన్నో రాజకీయ పార్టీలు తమ పార్టీతో కలవటానికి ఉత్సుకతను చూపిస్తున్నాయని, రాజకీయ మద్దతులలో చాలా మార్పులు రాబోతున్నాయని చెప్పిన వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, బహుశా సమయానికి ముందుగానే ఎన్నికల ప్రకటన జరగవచ్చని, అయితే ఆ పార్టీ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రాబల్యాన్ని కోల్పోబోతోందని ఆయన జోస్యం చెప్పారు.

--శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles