Suicide blasts near indian consulate in afghanistan kills 12

suicide blasts near indian consulate, blast near indian consulate, blast near indian consulate in afghanistan, blast near indian consulate in afghanistan, afghan attack on indian consulate, bomb blast near indian embassy, breaking news, ap politics, political news, andhra news

Suicide blasts near Indian Consulate in Afghanistan kills 12, Blast near Indian consulate in Afghanistan

భారత కాన్సులేట్ వద్దఆత్మహుతి దళాలు దాడి?

Posted: 08/03/2013 06:07 PM IST
Suicide blasts near indian consulate in afghanistan kills 12

అఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్‌లో భారత కాన్సులేట్‌పై ఆత్మహుతి దళ సభ్యుడు దాడి చేశాడు. ఈ ఘటనలో 12 మంది మరణించగా, 34మంది గాయపడ్డారు. ఈ రోజు ఉదయం పది గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత కాల్పులు జరిగిన శబ్దాలు వినిపించాయి. మృతులంతా సాధారణ పౌరులే. గాయపడినవారిలో అప్ఘానిస్తాన్ సైనికుడు ఉన్నాడని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. భారతీయులంతా క్షేమంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అమెరికా తన యాత్రికులను హెచ్చరించింది. ఈ రోజు జలాలాబాద్‌లోని భారత కాన్సులేట్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కాబూల్ సహా ఉన్న 21 రాయబార కార్యాలయాలను, కాన్సులేట్లను ఆదివారం మూసి ఉంచాలని అమెరికా ఆదేశించింది. ఆత్మాహుతి దళ సభ్యుడు భారత కాన్సులేట్ వద్ద తనను తాను పేల్చివేసుకున్నాడని చెబుతున్నారు. భారత కాన్సులేట్‌కు వెళ్లే మార్గాలను మూసివేశారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles