Minister tg yerasu condemn resignation news

tg venkatesh, erasu pratap reddy, telangana, samaikyandhra, Resignation News

Minor irrigations minister TG Venkatesh on Thursday came out with a new suggestion that could trigger a fresh debate over Telangana issue.

రాజీనామా చేయం... రాయలసీమ కావాలి

Posted: 07/25/2013 02:29 PM IST
Minister tg yerasu condemn resignation news

తెలంగాణ అంశానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుందని వస్తున్న సమాచారం అందుకొని, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు తమ అభిప్రాయాన్ని అధిష్టానానికి వివరించడానికి నిన్న సాయంత్రం హైదరాబాద్ లో సీమాంధ్ర మంత్రుల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందేన ఈ సమావేశంలో మంత్రులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే మూకుమ్మడి రాజీనామాలకైనా సిద్దపడాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను సీమాంధ్ర మంత్రులు అయిన టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి ఖండించడమే కాకుండా, రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతామని వారు స్పష్టం చేశారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాజీనామా చేస్తామని తాము ప్రకటించలేదని తెలిపారు. ఇప్పుడు మాట మార్చడమే కాకుండా నాలుగు గోడల మధ్య జరిగిన భేటీపై వివరణ తీసుకొని వార్తలు రాస్తే బాగుండేదని మీడియాకు చురక అంటించారు. సమైక్యరాష్ట్రం కోరుతూ తమ వాదన వినిపిస్తామని ప్రకటించారు. వెనకబాటుతనమే ప్రాతిపదికైతే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles