Intermediate girl marriage harassment in guntur

intermediate girl marriage harassment, student marriage harassment in guntur,

intermediate girl marriage harassment in guntur

గుంటూరులో ఇంటర్ అమ్మాయి పై దారుణం

Posted: 06/28/2013 12:18 PM IST
Intermediate girl marriage harassment in guntur

ఇటీవల కాలంలో నేరాలో, రెండో జోన్ గా గుంటూరు పేరుతెచ్చుకుంటుంది. గుంటూరు లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే గత సంఘటనలే నిదర్శనం. ఈ రోజు ఒక ఇంటర్ అమ్మాయిపై దారుణం జరిగింది.పెళ్లికి నిరాకరించినందుకు ఓ ఇంటర్ విద్యార్ధినికి ముగ్గురు యువకులు పురుగుల మందు తాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి..గోరంట్లలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంత్సరం చదువుతున్న మానస అనే విద్యార్ధినిని అదే ప్రాంతానికి చెందిన అనిల్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ నిరంతరం వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆ యువకున్ని మందలించారు. ఈ క్రమంలో అనిల్ తన స్నేహితులు రాజు, అశోక్ లతో కలిసి వచ్చి శుక్రవారం కళాశాలకు వెళ్తున్న మానసను ఆటోలోకి బలవంతంగా ఎక్కించారు. అనిల్ ను పెళ్లి చేసుకోవాలని వారు బలవంతపెట్టారు. దీనికి నిరాకరించడంతో వారు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును బలవంతంగా ఆమెతో తాగించారు. ఆమెను కళాశాల వద్ద వదిలివెళ్లారు. కళాశాల వద్దకు చేరుకోగానే మానస స్పృహ తప్పి పడిపోయింది. విషయాన్ని గమనించిన కళాశాల యాజమాన్యం 108 ద్వారా ఆమెను గుంటూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లి దండ్రులకు సమాచారమందించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టరు ప్రస్తుతం విద్యార్ధిని పరిస్ధితి నిలకడగానే ఉందని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకునన్న పోలీసుల నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles