Congress party new political game

congress party new political game, congress party, sonia gandhi, rahul gandhi, uttarakhanda flood victims, narendra modi, bjp,

congress party new political game

వ్యూహం మార్చిన కాంగ్రెస్‌!

Posted: 06/27/2013 03:28 PM IST
Congress party new political game

లోక్‌సభ ఎన్నికలను గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీల మధ్య పోరాటంగా చూడరాదని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అలాంటి ప్రచారానికి, వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని భావిస్తున్నది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులను ప్రశ్నించగా, సిద్దాంతాలు, పార్టీ పనితీరుపైనే తాము ప్రజాతీర్పును కోరతామని, వ్యక్తుల మధ్య పోరుగా భావించడం లేదన్నారు. కాగా, మోడీ వర్సెస్‌ రాహుల్‌ ప్రస్తావనను తెరపైకి తీసుకురావద్దని అధికార ప్రతినిధులకు పార్టీ ప్రసార విభాగ ఇన్‌చార్జ్‌ అజయ్‌ మాకెన్‌ సూచించారు. అదేవిధంగా టీవీ చానళ్ళ భేటీలో మోడీ బలహీనతలపై గట్టిగా మాట్లాడాలని చెప్పారు. ఉత్తరాఖండ్‌ వరద సహాయక చర్యల్లో మోడీ కేవలం గుజరాతీయులకు మాత్రమే సహాయం అందించారని, మిగతా వారిని పట్టించుకోలేదని, ఇలాంటి అంశాలను లేవనెత్తడం ద్వారా నరేంద్రమోడీపై ఎదురుదాడి చేయాలని మాకెన్‌ సూచించినట్లు తెలుస్తోంది. గుజరాత్‌ అభివృద్ధిపై ఆయన చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. సోషల్‌ మీడియాను సద్వినియోగం చేసుకుంటూ, కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని అధికార ప్రతినిధులకు మాకెన్‌ మార్గదర్శకాలు జారీచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles