Narayana educational institutions harassment on students

narayana educational institutions, intermediate students, degree students, parents, hydrabad,

narayana educational institutions harassment on students

నరకం చూపిస్తున్నా 'నారాయణ..'

Posted: 06/21/2013 05:10 PM IST
Narayana educational institutions harassment on students

నారాయణ అంటే రాజకీయ నేత సీపిఐ నారాయణ కాదులేండి. ఈ నారాయణ విద్యార్థుల పాలిట యముడుగా మారిన నారాయణ. చదువు పేరుతో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. నారాయణ విద్యాసంస్థల బాగోతం మరొకటి వెలుగు చూసింది. కార్పొరేట్ కళాశాలలు ఇచ్చే ప్రకటనలకు ఆకర్షితులై ఆ సంస్థలో చేరిన వారికి నరకం చూపిస్తున్నారు. ఇందుకు నిదర్శనం కృష్ణా,నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యార్థులు పడుతున్న మానసిక వేదన. ఐఎఎస్ కావాలనే దృఢ సంకల్పంతో డిగ్రీ కోర్సులో చేరిన వీరికి.. నారాయణ విద్యాసంస్థల సిబ్బంది, యాజమాన్యం ముప్పులు తిప్పలు పెట్టారు. ఈ రెండు జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు మొదట సంఘీనగర్ లోని క్యాంపస్ లో చేరారు. వీరి కోర్సు నాలుగేళ్లలో పూర్తవుతుంది. ఇప్పటికే రెండేళ్ల చదువు పూర్తయింది. ఇప్పటి వరకూ ఏడాదికి రెండు లక్షల చొప్పున 4 లక్షల రూపాయల ఫీజు చెల్లించారు. కాగా... కాలేజిలో చేర్చుకునే ముందు చెప్పిన సౌకర్యాలు ఏవీ కల్పించకపోగా... ఏడాదికో క్యాంపస్ మారుస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ప్రస్తుతం మూడోసారి ఆర్టీసీ క్రాస్ రోడ్ కు క్యాంపస్ మార్చారని తెలిపారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఉంటే ఉండండి, లేకపోతే వెళ్లిపోండని సమాధానమిస్తున్నారని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles