Kavuri sambasiva rao to be get cabinet posts

kavuri sambasiva rao, jd seelam, congress, ys jagan, seemandhra, Congress gears up for elections, Union Cabinet, JD Seelam, Manmohan Singh Cabinet, Kavuri, Rayapati, V Hanumantha Rao, MA Khan, JD Seelam

Kavuri Sambasiva Rao to be get cabinet posts.

కావూరి పంతం నెగ్గింది

Posted: 06/18/2013 09:45 AM IST
Kavuri sambasiva rao to be get cabinet posts

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఏలూరు లోక్ సభ సభ్యుడు కావూరి సాంబశివరావు తను అనుకున్నది సాధించారు.  ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఆయనకు పోయిన మంత్రి వర్గ విస్తరణ సమయంలో తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పై అలకబూనాడు.  తాను ఈ పార్టీలో ఉండలేనని అన్నారు. ఒక దశలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది.  రాష్ట్రంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు. అలాంటిది ఆకస్మికంగా ఏమి జరిగిందో కాని, తర్వాత జరిగిన బుజ్జగింపులతో ఆయన చల్లబడ్డారు. బడ్జెట్ సమావేశాల కు ముందు రాజీనామాను వెనక్కు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి మంతనాలు జరిపారు. మెల్లగా ఢిల్లీలో కూడా సంబంధాలు పునరుద్దరించుకున్నారు. ఇప్పుడు సడన్ గా ఆయనను కాంగ్రెస్ లో అత్యున్నత విధాయక మండలి అయిన వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడుగా నియమించచడమే కాకుండా, కేందద్రమంత్రి పదవి కూడా ఇచ్చారు. కావూరి కేబినెట్లో బెర్త్ దొరకడంపై కావూరి స్పందించారు. తనకు  ఇవ్వడం సంతోషంగా ఉందని, పార్టీలో బాధ్యతలు ఇంకా పెరిగాయని అన్నారు. ఏ శాఖ అయినా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. ఆయనను వరించింది.దీనితో కావూరి పంతం నెగ్గినట్లయింది. కావూరి అవసరం భవిష్యత్తులో చాలా ఉంటుందని అధిష్ఠానం భావించి ఈ పదవులు కట్టబెట్టిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles