Six peoples dead in us shooting rampage

Santa Monica College, shooting, two dead, burned home, fire, California, shooter, suspect, us news

A black-clad gunman killed at least four people in a shooting rampage in the US state of California, before police shot him dead in a college library, officials said

అగంతకుని కాల్పుల్లో 6గురు దుర్మరణం

Posted: 06/08/2013 03:11 PM IST
Six peoples dead in us shooting rampage

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్ రక్తాన్ని చిమ్మింది. గతంలో ఎన్నోసార్లు అగంతకుల చేతిలో ఎంతోమంది అమాయకులు బలైన సంగతి తెలిసిందే. తాజాగా నేడు కాలిఫోర్నియాలోని సాంటా మోనికాలో సాయుధుడైన ఆగంతకుడు ఆరుగురిని పొట్టనపెట్టుకున్నాడు. నల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి సాంటా మోనికా కాలేజీలోని లైబ్రరీలో ప్రవేశించి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. కాల్పుల శబ్దాలు విన్న ఇతర విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దుండగుణ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని కాలిఫోర్నియా పోలీసు అధికారులు తెలిపారు. కాగా ఆ ఆగంతకుడి వివరాలు ఇంకా గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఇలా ప్రతిసారి అమాయకులు బలవుతుండంటంతో ఈ గన్ కల్చర్ కు చరమగీతం పాడాలని పలువురు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles