Telugu desam laxmi parvathi suggestion for chandrababu naidu

laxmi parvathi, senior ntr wife laxmi parvathi, tdp, tdp mahanadu, senior ntr jayanthi, nandamuri taraka ramarao 90th birthday, chandrabbau naidu, 2014 election, tdp win, balakrishna, junior ntr,

laxmi parvathi suggestion for chandrababu Naidu

బాబుకు విజయం : లక్ష్మిపార్వతి

Posted: 05/28/2013 06:46 PM IST
Telugu desam laxmi parvathi suggestion for chandrababu naidu

పార్లమెంట్ ఆవరణలో నందమూరి తారక రామారావు విగ్రహం పెట్టిన నాటి నుండి లక్ష్మీ పార్వతిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ రోజు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దూరంగా ఉంటుంది. అయితే వైసీపీ ఆద్వర్యంలో జరుగుతున్న దీక్షకు కూడా లక్ష్మీపార్వతి వెళ్లలేదు. నందమూరి తారకరామారావు 90వ జయంతిని టిడిపి నేతలు, కార్యకర్తలు మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న నందమూరి కుటుంబ సభ్యులు పుష్ఫగుచ్చాలతో నివాళులర్పించారు.

నందమూరి హరికృష్ణతోపాటు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, లక్ష్మీపార్వతి అంజలి ఘటించారు. టిడిపి అధినేత చంద్రబాబు, బాలకృష్ణ మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరినీ కలుపుకుపోతేనే టిడిపి విజయం సాధిస్తుందని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత ఆమె మాట్లాడారు. ఎన్టీఆర్ ఆశయాలను విస్మరించినందుకే టిడిపి ప్రజలకు దూరమై, అధికారాన్ని కోల్పోయిందని చెప్పారు. అందరితో సమన్వయం చేసుకుంటూ పోతే ఉంటే చంద్రబాబుకు మంచిదని హితవుపలికారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుకు విజయం దక్కలాని లక్ష్మీ పార్వతి కోరుకోవటం విశేషంగా ఉందని.. టీడీపీ సీనియర్ నాయకులు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles