Tdp begins bayyaram bus yatra

tdp, bayyaram yatra, telangana, Errabelli Dayakar Rao, vizag steel plant, khamam steel plant

TDP Begins Bayyaram bus yatra.

బయ్యారానికి క్యూ కట్టారు

Posted: 05/14/2013 04:39 PM IST
Tdp begins bayyaram bus yatra

తెలంగాణ టీడీపీ ప్రాంత నేతలు ఆ పార్టీని బలపరచడానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా దానిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టు పై ధర్నా చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు బయ్యారం గనుల పై ధర్నా చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు వారు నేడు భయ్యారానికి బస్సు యాత్ర చేపట్టారు. అసెంబ్లీ నుండి వీరు బయ్యారానికి యాత్రగా చేరుకుంటారు. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ స్థాపించాలని, అన్ని ప్రాంతాల టీడీపీ నేతల అభిప్రాయం ఇదేనని, అధినేత చంద్రబాబు నాయుడు కూడా బయ్యారంలోనే ఉక్కు ఫాక్టరీని స్థాపిస్తూ, విశాఖకు కూడా ఖనిజాన్ని ఇవ్వాలని అన్నారని తెలంగాణా టీడీపీ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి తెలిపారు. రక్షణ స్టీల్స్‌కు బయ్యారం గనుల కేటాయింపు రద్దు టీడీపీ పోరాట ఫలితమేనని ఆయన చెప్పారు. మరో వైపు ఓబుళాపురంలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలంటూ సీపీఐ సంతకాల సేకరణ ఉద్యమం మొదలు పెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles