Political bjp plans state wide protests on 4th and 5th

bjp statewide protest, bjp protest on 4th and 5th, parliament disrupted by bjp, coal allocation scam, prime minister, law minister

bjp plans state wide protests on 4th and 5th

రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నిరసన

Posted: 05/02/2013 03:46 PM IST
Political bjp plans state wide protests on 4th and 5th

ఈనెల 4, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిల్లో నిరసన చేపట్టటానికి భారతీయ జనతాపార్టీ ఏర్పాట్లు చేసుకుంటోంది.  అందుకు అన్ని సన్నాహాలూ చేస్తున్నామని భాజపా నాయకుడు కిషన్ రెడ్డి మెదక్ లో అన్నారు. 

బొగ్గు కుంభకోణంలో సిబిఐ దర్యాప్తులో న్యాయశాఖా మంత్రి ప్రమేయాన్ని భాజపా చాలారోజులుగా దుయ్యబడుతూనేవుంది.  ప్రధాన మంత్రి రాజీనామాను కోరుతూ పార్లమెంటుని స్తంభింపజేస్తూనేవుంది.  ఇప్పుడు అదే విషయం మీద రాష్ట్రంలో నిరసనలు చేయాలని సంకల్పించింది. 

రాష్ట్ర స్థాయి నిరసనల గురించి మాట్లాడుతూ కిషన్ రెడ్డి, భాజపా అధికారంలోకి వస్తే బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం స్థాపించబడుతుందని, భాజపా పరిపాలనలోని క్షేత్రాల్లో అమ్మహస్తం, బంగారుతల్లిని మించిన పథకాలు అమలులోకి వస్తాయని అన్నారు. 

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles