Political gandra venkataramana reddy fire on kcr

gandra venkataramana reddy fire on kcr, congress vip gandra venkata ramana reddy, trs party, congress party, telangana issue, vote, money, mp.k chandrasekara rao,

gandra venkataramana reddy fire on kcr

కేసీఆర్ ఆరాటం

Posted: 04/29/2013 09:53 AM IST
Political gandra venkataramana reddy fire on kcr

ఓట్లు, నోట్ల కోసమే కేసీఆర్ ఆరాటపడుతున్నారే తప్ప తెలంగాణ రాష్ట్రం సాధించాలనే చిత్తశుద్ధి ఆయనకు లేదని ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయని కేసీఆర్ ఇప్పుడు ఓట్లతో సీట్లు వస్తే తెలంగాణ తెస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్మూర్ సభలో కేసీఆర్ ప్రకటించిన హామీలు ఆచరణ సాధ్యం కావని, ప్రజలను మభ్యపెట్టేందుకు అలాంటి ప్రకటనలు చేస్తున్నారని గండ్ర వ్యాఖ్యానించారు. ఆయన వరంగల్ జిల్లా పరకాల ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. కేసీఆర్ మాదిరిగా ప్రజలను మభ్యపెట్టే విధంగా హామీలు ఇవ్వడం లేదన్నారు, కాంగ్రెస్ పార్టీ 2014లో ప్రత్యేక తెలంగాణ ఇస్తుందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష నేత స్థానం కూడా దక్కదనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ఒక వృథా ప్రయాసేనని, ఆయన పాదయాత్రపై ఆ పార్టీ నేతలకే విశ్వాసం లేకుండా పోయిందన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles