New stay with modern amenities at shirdi

shirdi, saibaba sansthan, dilsukhnagar, sri sai nivas, ashram at shirdi, modern amenities at shirdi

new stay with modern amenities at shirdi

షిర్డీ యాత్రికులకు షిర్డీలో మరో ఆధునిక వసతి గృహం

Posted: 04/12/2013 12:00 PM IST
New stay with modern amenities at shirdi

మొత్తం మూడు ఎకరాల స్థలంలో 156 గదులతో విశాలమైన ప్రాంగణంతో హైద్రాబాద్ దిల్ సుఖ్ నగర్ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ సాయి నివాస్ భవన సముదాయం నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహన్ చేతులమీదుగా ప్రారంభించబడింది.  ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి సి.రామచంద్రయ్య, ఎంపీ వి హనుమంతరావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లు పాల్గొన్నారు. 

భవన సముదాయం ఒక ఎకరం స్థలంలో నిర్మించగా రెండు ఎకరాల స్థలాన్నిపచ్చిక బయళ్ళు, పార్కింగ్ కోసం కేటాయించారు.  వసతి గృహంలో ఎసి, నాన్ ఎసి, సూట్ లు కూడా ఉన్నాయి.  భోజన వసతి కూడా ఏర్పాటు చేసి అందులో దక్షిణాది వంటలతో పాటు ఉత్తరాది వంటకాలను కూడా వడ్డించే ఏర్పాటు చేసారు. 

శ్రీ సాయినివాస్ ధర్మశాలలో గదులు కావాలంటే దిల్ సుఖ్ నగర్ లోని ఆలయంలోని పిఆర్ వో కార్యాలయంలో సంప్రదించవచ్చు, లేదా ఆన్ లైన్ లో కూడా రిజర్వ్ చేసుకునే ఏర్పాటు కలిగించారు.  అందుకు వెబ్ సైట్స్- www.shrisainivas.com and www.saisansthan.in .

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Army celebrates 65th indian army day
Sankranthi celebrations in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles