Spacial facilities to accused in delhi rape case

delhi gang rape case, rape accused vinay sharma, defence lawyers warned, indian airforce clerical test

spacial facilities to accused in delhi rape case

speacial-facilities.png

Posted: 04/02/2013 10:49 AM IST
Spacial facilities to accused in delhi rape case

ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో డిఫెన్స్ లాయర్లకి అక్షింతలు, నిందితుడికి ప్రత్యేక ఏర్పాట్లు

ఢిల్లీ సామూహిక అత్యాచార కేసు విచారణలో గంట ఆలస్యంగా వచ్చిన నిందితులు పవన్ గుప్తా, వినయ్ శర్మల డిఫెంస్ లాయర్లకు జడ్జ్ అక్షింతలు పడ్డాయి. ఇలాగే కొనసాగితే ఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీ కి రిఫర్ చేసి నిందితులకు తగు డిఫెంస్ ని కలుగజేయవలసిందిగా కోరతాను అన్నారు జడ్జ్.

ఢిల్లీలో బస్సులో అతి దారుణంగా 23 సంవత్సరాల మెడికో మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఇంతవరకు 63 సాక్షుల సాక్ష్యాన్ని రికార్డ్ చెయ్యటం జరిగింది. నిందితుడు వినయ్ శర్మ తనకి మంచి ఆహారం, పౌష్టిక పదార్థాలు, వేసుకోవటానికి మంచి దుస్తులు, చదువుకోవటానికి పుస్తకాలు కావాలంటూ అర్థించగా ఆ ఏర్పాట్లను చూడమని జడ్జ్ తిహార్ జైలు అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఏప్రిల్ 7 న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాత పరీక్షకు హాజరవబోతున్న వినయ్ శర్మ, తనకు చదువుకోవటానికి వార్తా పత్రికలు, తినటానికి పౌష్టికాహారం, వేసుకోవటానికి మంచి దుస్తులు కావాలని కోరారు. అతని దుస్తులన్నీ పోలీసులు నేరంలో కేసుకి చెందిన వస్తువులుగా విడిగా ఉంచటం వలన, జైలులో కన్నాలు పడ్డ దుస్తులను ఇవ్వటం వలన ఇబ్బందిగా ఉందని వినయ్ శర్మ జడ్జి కి మొరపెట్టుకున్నాడు. పరిస్థితి గమనించిన జడ్జ్ అతనికి కావలసిన ఏర్పాట్లను చెయ్యమని తిహార్ జైలు అధికారులకు చెప్పారు.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Agitation at vizag hindustan zinc
8 persons of same family dead in road accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles