9 mlas suspended by punjab speaker from assembly

punjab assembly,taran taran police atrocities, congress party of india, speaker of punjab assembly

9 mlas suspended by punjab speaker from assembly

mlas-suspended.png

Posted: 03/14/2013 04:55 PM IST
9 mlas suspended by punjab speaker from assembly

charanjit-singh-atwalక్రమ శిక్షణారాహిత్యానికి క్రమ శిక్షణను తప్పి ప్రవర్తించటం సమాధానం కాదు కదా  పంజాబ్ రాష్ట్ర శాసన సభ్యులు నిన్న శాసన సభలో గందరగోళాన్ని సృష్టించారు.  క్రమ శిక్షణను సభా మర్యాదను ఉల్లంఘించటమే కాకుండా అక్కడి పనివారిమీద చెయి చేసుకున్నారు కూడా.  అసెంబ్లీలో పనిచేస్తున్న జైపాల్ సింగ్ తనను లాగి పడేసి కొట్టారంటూ పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యటంతో ఈ విషయం ఇంకా ముదిరి పాకాన పడింది. ఈరోజు పంజాబ్ శాసన సభ సభాపతి చరణ్ జీత్ సింగ్ ఆత్వాల్ ఈ విషయం మీద 9 మంది కాంగ్రెస్ శాసన సభ్యులను అసెంబ్లీలో క్రమశిక్షణా రాహిత్యంతో క్రిమినల్ చర్యలో భాగం వహించారన్న ఆరోపణతో ఈరోజు శాసన సభనుంచి వాళ్ళని బహిష్కరించారు.  

అసలు వచ్చిన గొడవంతా, కాంగ్రెస్ శాసన సభ్యులు ఒక మహిళను తమతోపాటు అసెంబ్లీలోకి తీసుకొచ్చారు.  కానీ ఆవిడకు లోపలికి వచ్చే అనుమతినిచ్చే పాస్ లేకపోవటంతో సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం తెల్పుతూ ఆవిడను బయటకు రమ్మని కోరగా ఆవిడను తీసుకొచ్చిన సభ్యులు అడ్డుపడ్డారు.  ఇంతకీ ఆవిడ ఎవరంటే ఆ మధ్య తరతరన్ పోలీసులు, లారీ డ్రైవర్ అమర్యాదగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదు చెయ్యటానికి వచ్చిన మహిళను, ఆవిడ తండ్రిని కొట్టిన పోలీసు చర్యలో బాధితురాలు.  ఆవిడను అసెంబ్లీలోకి అనుమతి లేకుండా ప్రవేశపెట్టటానికి చూడటం భద్రతా సిబ్బంది అభ్యంతరాలకు దారితీసింది.  

ప్రతిపక్షనాయకుడు సునీల్ జాఖడ్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు గుర్తింపు కానీ అనుమతి కానీ లేని వ్యక్తిని శాసన సభలో ఏదో లక్ష్యంతో ప్రవేశపెట్టటానికి చూసారు అంటూ ఆత్వాల్ ఆరోపించారు.

తరన్ తరన్ లో ఆ మహిళకు అన్యాయం జరిగిందంటే ఆమెను చట్ట విరుద్ధంగా వేధించారంటే అందుకు సమాధానం తాము కూడా చట్ట విరుద్ధంగా ప్రవర్తించటం కాదు కదా.  ఒక వేళ ఆ మహిళకు న్యాయం చెయ్యాలన్నా ఇది పద్ధతి కాదు కదా.  పైగా శాంతి భద్రతలను కాపాడే సిబ్బంది, వారిలో ఎక్కడైనా తప్పు జరిగినా దాన్ని సమర్థించటానికే చూస్తారు.  అందువలన ఆవిడను గుర్తుపట్టటం, అభ్యంతరం తెలియజేయటం జరిగుంటుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Death row convict in rajiv killing gets gold medal
Both houses at center adjourned amidst uproar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles