Ap assembly adjourned for one hour

ap assembly, budget session of ap, no confidence motion, trs party, tdp party, communist parties, bjp

ap assembly adjourned for one hour

ap-assemby-adjourned.png

Posted: 03/14/2013 10:40 AM IST
Ap assembly adjourned for one hour

ఈ రోజు శాసనసభలో తెరాస సభ్యులు తెలంగాణా గురించి సభలో చర్చిస్తూ సభాపతి దగ్గరకు పోయి ఆందోళన కొనసాగించటంతో సభ గంట సేపు వాయిదా పడింది.  సభ్యులను సభను సజావుగా సాగించేందుకు సహకరించమని సభాపతి చేసిన విఙప్తి ని వారు వినకపోవటంతో సభ వాయిదా వెయ్యవలసివచ్చింది.  

విపక్షాలు అవిశ్వాస తీర్మానం దిశగా కదుపుతున్న పావులను గమనించిన ముఖ్యమంత్రి అక్కడ అందుబాటులో ఉన్న మంత్రులతో మంతనాలు జరిపారు.  

భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, నాగం జనార్దన రెడ్డి తో కలిసి తెలంగాణా రాష్ట్ర సమితి మొత్తం 25 సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం నోటీసుని సభాపతికి అందజేసింది.  

ఈ విషయంలో మాట్లాడుతూ ఈటెల రాజేందర్, ధరల నియంత్రణలోనూ విద్యుత్ సరఫరా లోనూ ప్రభుత్వ వైఫల్యం వలన సామాన్య ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారని, ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని, అందువలన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అన్ని శక్తులనూ వొడ్డి ప్రయత్నిస్తామని చెప్తూ, ఇందులో తెలుగు దేశం పార్టీకూడా తోడుగా ఉంటే చాలా బావుండేదని, రాజకీయ దృష్టితో ఆలోచించకుండా తెలుగుదేశం పార్టీ సహకరించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. 

వాయిదా పడ్డ సభ 10 గంటలకు తిరిగి ప్రారంభమైంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nirbhay father refuses to take back fees from institute
Last date for submission of aadhar details extended  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles