Shahrukdh khan honors women

shah rukh khan, tata tea, womens day, honor to women

shahrukdh khan honors women

shahrukh-announces.png

Posted: 03/09/2013 04:44 PM IST
Shahrukdh khan honors women

sharukh-photo

సంఘసంస్కరణలు, సమాజోద్ధరణకోసం టాటా టీ వారు తయారు చేసే ప్రకటనలో ఈ సారి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పట్ల మన వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు రావాలి అన్న విషయం మీద ప్రకటన ఫిల్మ్ తయారు చేసారు.  ఇంతవరకూ అవినీతి నిర్మూలన, ఓటు హక్కు వినియోగం లాంటి వాటి మీద దృష్టి సారించిన టాటా టీ ఈసారి షారుఖ్ ఖాన్ తో నిర్మిస్తున్న ఈ అడ్ ఫిల్మ్ లో మహిళా సమాన హక్కు గురించిన ప్రస్తావన ఉంటుంది.  మహిళల మీద అకృత్యాలు ఎక్కవవుతున్న సందర్భంగా షారుఖ్ లాంటి ప్రఖ్యాత నటుడి సహకారంతో తయారైన అడ్ కి స్పందన ఎక్కువగా ఉంటుంది, సమాజంలో మార్పుకి బాటలు వేస్తుంది అని టాటా యాజమాన్యం తెలియజేసింది.  

మహిళల పట్ల దురాచారం పట్ల తీవ్రంగా స్పందించిన షారుఖ్ ఖాన్, అమెరికా ప్రభుత్వం ఢిల్లీ సామూహిక అత్యాచారానికి గురైన మహిళకు ఇస్తున్న ధీర వనిత పురస్కారం విషయంలో కూడా అలా గుర్తింపుకోసం పురస్కారం ఇవ్వటం మంచిదే కానీ, పురస్కారం కోసం ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోకూడదంటూ ఆవేదనతో అన్నారు.  తన సినిమాల్లో కూడా పేర్లు చూపించేటప్పుడు ప్రస్తుతం పాటిస్తున్న హీరోపేర్ల తర్వాత హీరోయిన్ల పేర్లు చూపించటం కాకుండా, తనతో పనిచేసిన మహిళలపేర్లు ముందుగా వచ్చేట్టు, ఆ తర్వతనే తన పేరు వచ్చేట్టుగా చూస్తానని ఆవిధంగా మహిళలకు తాను ప్రాధాన్యతనివ్వదలచుకున్నానని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp finalize mlc list
Bomb blast in peshawar masjid killed 6  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles