Meerja abdul wounded in two bomb incidents

dilsukhnagar bomb blast, terrorists, hyderbad bomb blast

meerja abdul wounded in two bomb incidents given clean chit by police

abdul-wase.png

Posted: 02/28/2013 08:59 AM IST
Meerja abdul wounded in two bomb incidents

మీర్జా అబ్దుల్ వసే.  రెండోసారి కూడా బతికి బయటపడ్డాడు.  ఇతని పేరు హైద్రాబాద్ దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళతో పాటు ముడిపడి అందరి నోళ్ళల్లోనూ నానింది. 

పాతబస్తీ కాలాపత్థర్ లో నివసించే అబ్దుల్ వసే 2007లో మక్కా మసీదు పేలుళ్ళలో గాయపడ్డాడు.  అక్కడ బతుకు వెళ్లబోసుకోవటం కష్టంగా ఉందని దిల్ సుఖ్ నగర్ వెంకటాద్రి సినిమా హాలు ముందు ఫుట్ పాత్ మీద బట్టలు అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తున్న అతను మరోసారి ఫిబ్రవరి 21 న జరిగిన దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ పాల పడ్డాడు.  రెండు సార్లు బాంబు పేలుళ్ళలో గాయపడటం జరిగింది.  అయితే రెండు సార్లు అలా ఉగ్రవాద  దాడికి గురైన ఘటనా స్థలిలో కనిపించటం అనుమానాలకు దారితీసింది.  మీడియా కూడా అతని మీద దృష్టి సారించింది.

అయితే పూర్వాపరాలు పరిశీలించిన పోలీసులు రెండు సార్లు గాయపడి కోలుకున్న 21 సంవత్సరాల అబ్దుల్ ని నిర్దోషిగా గుర్తించి, ఈ విషయాన్ని మీడియాకు కూడా తెలియజేసారు.  ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం బాపతు 50000 రూపాయల చెక్కు కూడా అతనికి అందింది.  పూర్తిగా కోలుకునేంత వరకూ విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారు.  రెండో సారి కూడా తన ప్రాణాలను రక్షించిన అల్లా కి కృతఙతలు తెల్పుతూ, గాయాలింకా బాధపెడుతూనే వున్నాయి కానీ ప్రమాదం తప్పింది అంటాడు అబ్దుల్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Augusta scam probed to be monitered by jpc
Telugu political leaders fire on vayalar ravi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles