పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే నాకు చాలా భయం అని సామాన్య ప్రజలు అనటం మనం వినే ఉంటాం. కానీ ఒక పోలీస్ అధికారి మాత్రం పోలీస్ స్టేషన్ అంటే చాలా భయం అని చెబుతున్నారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు మహారాష్ట్ర మాజీ డీజీపినే. ఈ అధికారితో పాటు మరో ఐపీఎస్ అధికారి అరవింద్ ఇనామ్ దార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సోదర పోలీసుల ప్రవర్తనపై తీవ్ర విమర్శనాస్త్రాలు సందించారు. పోలీసు స్టేషన్ కు వెళ్లాలంటే తనకే భయమేస్తోందని, అక్కడ ఎవరైనా ఏ విధంగానైనా అవమానించవచ్చనని ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆపకుండా ఆయన స్థానిక పోలీసు స్టేషన్లను ‘హఫ్తా స్టేషన్స్’ అని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారి ఇనామ్ దార్ 35 సంవత్సరాల్లో 29 సార్లు బదిలీ అయ్యారు. పదవీ విరమణకు ఇంకా ఒక ఏడాది ఉండగానే బలవంతంగా వీఆర్ఎస్ తీసుకోవాల్సివచ్చింది. అదే వేదికపై ఇనామ్ దార్ కన్నా ముందు మాట్లాడిన మరో సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ కోకిల్ కూడా తానెదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టారు. సంజీవ్ రాసిన కవితా సంపుటుల ఆవిష్కరణ సభలోనే ఈ మాటల తూటాలు పేలడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more