Andhra hc rejects jagan bail plea

jaganmohan reddy,andhra pradesh high court,investments,andhra pradesh

Andhra HC rejects Jagan bail plea

agan bail plea.gif

Posted: 01/24/2013 06:55 PM IST
Andhra hc rejects jagan bail plea

Jagan-bail-rejected-again

వైసీపీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్ బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.  సీబీఐ వాదనతో ఏకీభవిస్తూ ఈ పిటిషన్ విచారణార్హం కాదంటూ న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో పాటు, కేసు విచారణలో ఉన్నందును బెయిల్ ఇప్పుడే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే వీలైనంత త్వరగా ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు వినతి చేశారు. జగన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు నేపథ్యంలో ఆయన సతీమణ భారతి, ఏ-2 నిందితుడుగా ఉన్న విజయసాయిరెడ్డి కోర్టుకు వచ్చారు. అయితే కోర్టు తీర్పుతో వారు నిరాశచెందారు.  మరోవైపు జగన్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంపై వైసీసీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తపరిచారు. జగన్ కేసులో ప్రభుత్వం సహకరించడం లేదన్న ఆరోపణల్లో నిజం లేదని ఆ పార్టీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Byreddy rajasekhara reddy meet on sushil kumar shinde
Mp asaduddin owaisi gets bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles