Aunty raped by nephew in kurnool

Aunty raped by nephew, Aunty raped by nephew in kurnool, friends gang rape, kurnool hospital,

Aunty raped by nephew in kurnool

Aunty raped by nephew.gif

Posted: 01/12/2013 11:00 AM IST
Aunty raped by nephew in kurnool

Aunty raped by nephew in kurnool

కామంతో కళ్లు మూసుకుపోయిన  మగవాడికి కళ్ళకు ఏమి కనిపించదని మరోసారి రుజువు అయ్యింది.  సొంత మేనత్తపై  మేనల్లుడు  తన స్నేహితులతో కలిసి కామవాంచ తీర్చుకున్నాడు...ఆకలితో ఉన్న మేనత్తకు భోజనం పెట్టిస్తానని చెప్పి బయటికి తీసుకెళ్లి.. స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు! కర్నూలులో అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. బాధితురాలు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బ్రాహ్మణకొట్కూరు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన మహిళ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వచ్చారు. ఆ మహిళ మేనల్లుడు.. ఆమెకు భోజనం పెట్టిస్తానని చెప్పి ఆటోలో బయటికి తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో మరో నలుగురిని ఆటోలో ఎక్కించాడు. ఆటోను గుత్తి పెట్రోలు బంకు వైపు పోనిచ్చాడు. పెట్రోలుబంకు దాటిన తర్వాత వీరంతా మహిళను ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపరిచారు. తిరిగి ఆమెను బైక్‌పై తీసుకెళ్లి ఆసుపత్రిలో వదిలేసి పారిపోయారు.  గాయపడిన బాధితురాలిని గమనించిన సమీప బంధువు ఒకరు.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. సాయంత్రానికి తేరుకున్న బాధితురాలు అసలు విషయం తెలిపింది. జరిగిన దారుణంపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ డిమాండ్ చేశారు. కాగా.. ఈ విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులు గతంలో కూడా పలు అత్యాచారాలకు పాల్పడినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suman rathod mla police custody
Akbaruddin owaisi sent to 5 day police custody  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles