Tdp mla yarapathineni srinivasa rao arrested

tdp mla yarapathineni srinivasa rao, yarapathineni srinivasarao, tdp mla arrest, gurajala mla, congress leader murder case

TDP MLA Yarapathineni Srinivasa Rao arrested

TDP MLA Yarapathineni.gif

Posted: 01/09/2013 11:10 AM IST
Tdp mla yarapathineni srinivasa rao arrested

 TDP MLA Yarapathineni Srinivasa Rao arrested

 కాంగ్రెస్ కార్యకర్త హత్యకేసులో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యరపతినేనిని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయనపై రెండు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఈరోజు ఉదయం యరపతినేనిని పిడుగురాళ్ల న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. దీంతో ఎమ్మెల్యే అరెస్టుకు నిరసనగా గురజాల బంద్‌కు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. కాగా కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని యరపతినేని ఆరోపించారు. ప్రభుత్వం కక్షకట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ నేత హత్య కేసులో అరెస్టు అయిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి ప్రోద్భలంతోనే తనపై తప్పుడు కేసు నమోదైందని తెలిపారు. న్యాయపోరాటం చేస్తా.. నిర్దోషిగా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం యరపతినేని గుంటూరు జిల్లా సబ్ జైలులో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla akbaruddin owaisi sent to 14 day judicial custody
Mp asaduddin owaisigif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles