Gali muddu krishnama naidu fire on congress government

gali muddu krishnama naidu, tdp leader gali muddu krishnama naidu, congress party, assembly, cm kiran kumar reddy, congress government,gali,

gali muddu krishnama naidu fire on congress government

gali muddu krishnama.gif

Posted: 12/11/2012 07:38 PM IST
Gali muddu krishnama naidu fire on congress government

gali muddu krishnama naidu fire on congress government

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు మాటల దాడి చేశారు.  ముఖ్యమంత్రికి భయపడుతున్నాడని, అందువలనే  అసెంబ్లీ సమావేశాలు  నిర్వహించటడం లేదని  ఆయన అన్నారు.   అసెంబ్లీ సమావేశాలు  నిర్వహించేందుకు  ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారో స్పష్టం చేయాలని  గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ  అధికారంలో వచ్చిన తరువాత నుండి అసెంబ్లీ సమావేశాల చాలా తక్కువగా జరిగినట్లు ఆయన చెబుతున్నారు. గత  మూడు సంవత్సరాల నుండి 156 రోజులు మాత్రమే  సమావేశాలు  నిర్వహించిన ఘనత  కాంగ్రెస్ ప్రభుత్వనికే దక్కుతుందని  ఆయన ఎద్దేవా చేశారు.  ఈ నెల 10నుండి 21 వరకు  జరిగే సమావేశాల్లో  11 ప్రధాన  అంశాలపై  చర్చించాలని తెదేపా  శాసన సభా పక్షం నిర్ణయిస్తే  సర్కారు సమస్యల నుంచి పారిపోయిందని ఆయన మండిపడ్డారు.   స్పీకర్  సైతం ఎస్సీ, ఎస్టీ  ఉప ప్రణాళికపై జరిగిన సమావేశాల  అనంతరం  సభ తిరిగి 10వ తేదీన  ప్రారంభమవుతుందని చెప్పకుండా  నిరవధిక వాయిదా  వేయటం  రాష్ట్ర ప్రజలను  మోసగించడమేనని ఆయన దుయ్యబట్టారు.  అవిశ్వాసం పెట్టండీ అంటూ పదే పదే డిమాండ్  చేసిన  వైకాపా  ఇప్పుడు  జగన్ కు బెయిల్  వచ్చేవరకూ  వద్దని  స్పష్టం చేయటం ద్వారా  ఎవరు ఎవరితో  కుమ్మక్కయ్యారో  ప్రజలు గ్రహించాలని  ఆయన కోరారు.   అసెంబ్లీ సమావేశాలు పెట్టాడని సీఎం ఎందుకు భయపడుతున్నారో  అర్థం కావటం లేదని  గాలి ముద్దు క్రిష్ణమ నాయకుడు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero tarakaratna fire accident in movie shooting
Trs launches basti bata at hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles