Telangana jac future course of action

telangana jac, telangana political jac, t jac, trs, tdp, congress, ysrcp, cpi, cpm, loksatta, telangana agitation, telangana state hood,jac future course of action

telangana jac future course of action

9.gif

Posted: 12/09/2012 01:05 PM IST
Telangana jac future course of action

jac

   రాజకీయంగా కూడా తెలంగాణ అంశం రసకందాన పడిన ఈ సమయంలో తెలంగాణ జేఏసీ మరో అడుగు ముందుకేస్తోంది. జేఏసీ విస్తృతస్థాయి సమావేశం రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ విద్యానగర్‌లోని న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు జేఏసీ నేతలు తెలిపారు. ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న విద్రోహ దినం, 28న అఖిలపక్ష భేటీపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీలన్నీ తెలంగాణ అఖిల పక్ష భేటీలో మద్దతు తెలపాలని కోరారు.

st_jac
      ఇదిలా ఉండగా, తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని వాయిదావేయవద్దని ఓయు విద్యార్థి జెఎసి న్యూఢిల్లీ లో ఆందోళనకు దిగింది. ఇవాళ్టి (డిసెంబర్ 9) ప్రకటనను అమలు చేయాలని వారు కోరారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు జన్ పథ్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
      డిసెంబర్ 9వ తేదీని పురస్కరించుకుని తెలంగాణ కోసం సీపీఐ పోరుబాట పట్టంది హొంమంత్రి షిండేపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. షిండే ఓ కొత్త బిచ్చగాడని విమర్శించారు. తెలంగాణపై ఆయనకు అవగాహన లేదని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇంకా అధిష్టానాన్ని నమ్మితే వారిని ప్రజలు దిష్టిబొమ్మల్లా తగులబెడతారని హెచ్చరించారు. హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తాలో యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల నారాయణ దహనం చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India england kolkatta test cricket match
Ignou courses notification  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles