Mother attacked her daughter in vizag

Mother attacked her daughte, child cheeks burnt, bangaramma, bad mother burnt her daughter cheeks,

Mother attacked her daughter in vizag

Mother.gif

Posted: 11/29/2012 03:01 PM IST
Mother attacked her daughter in vizag

Mother attacked her daughter in vizag

చిన్న పిల్లలను తల్లిదండ్రులు మందలిస్తారు? కానీ మరీ ఘోరంగా మందిలించే తల్లిదండ్రులున్నారని నిరూపించింది ఒక తల్లి. పిల్లలకు తల్లిదండ్రులు భయం పెట్టాలి కానీ, దారుణంగా  భయం పెట్టకూడదు. కూతురు చేసిన చిన్న తప్పుకు ఒక తల్లి పెద్ద శిక్ష వేసింది.  పాప లేత బుగ్గలపై  ఆ తల్లి కాల్చిన అట్లకాడతో  వాతలు పెట్టి తన కసి తీర్చుకుంది.  విశాఖపట్నం  జగదాంబ  కూడలి  జీవీఎంసీ  25వవార్డు కోటవీధికి చెందిన  బంగారమ్మ తన పెద్ద కూతురు వసంత (7) ను అట్లకాడను కాల్చి వాతలు పెట్టింది.  రెండు రోజుల కిందట బంగారమ్మ  చిన్న కూతురు దేవకి (5) తల్లికి తెలియకుండా  ఇంటిలో  ఉన్న రూ. 10 తీసుకుంది.  ఇది తెలిసి తనకు చెప్పలేదనే  కోపంతో  తల్లి వసంత  రెండు  బుగ్గలపై  అట్లకాడతో వాతలు పెట్టింది.  తీవ్ర గాయాలైనా ఆమెకు ఎటువంటి  చికిత్స అందివ్వలేదు.  అయితే ఆ పాప ఆడుకోవటానికి   పక్కనే ఉన్న స్వచ్చంద సంస్థ కార్యాలయానికి  వెళ్లింది.  వసంత బుగ్గలపై  ఉన్న గాయాలను చూసి  సంస్థ సభ్యుడు వివరాలు  తెలుసుకుని వెంటనే చిన్నపిల్లలను సంరక్షించే  సంస్థ 1098 కు ఫోన్ లో  సమాచార మందించాడు. వారు వసంతను  వెంటనే ఆస్పత్రికి  తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడినుంచి  ఆమెను వన్ టౌన్ పోలీస్  స్టేషన్  కు తీసుకొచ్చి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.   అనంతరం వసంత  సంరక్షణ  బాధ్యతను  తమకు అప్పగించాల్సిందిగా  వినతి  పత్రం  అందించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs deeksha divas at indira park today
Ex minister peddireddy to resign as mla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh