Telugu desam party leaders blame ys jagan

ys jagan, brother anil, tdp party, chandra babu naidu, telugu desam, church pasters, money, telugu desam party leaders blame ys jagan on pasters money, ap politics, ysrcp, jagan party

telugu desam party leaders blame ys jagan on pasters money

1.gif

Posted: 11/18/2012 01:16 PM IST
Telugu desam party leaders blame ys jagan

church_ee

గ్రామాల్లో క్రైస్తవ ప్రార్థనా మందిరాలను నిర్వహిస్తున్న పాస్టర్లకు ఇటీవల భారీగా నగదు అందుతోందని కైకలూరు ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోపించారు. పార్టీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. "ఆ ప్రార్థనా మందిరానికి ఎందరు వస్తున్నారన్నదాన్ని బట్టి ఒక్కో పాస్టర్‌కు రూ.30 వేల నుంచి 50వేల వరకూ అందుతున్నాయి. పాస్టర్లలో టీడీపీ వారూ ఉన్నారు. వాళ్ళు వచ్చి మాకు ఈ విషయాలు చెబుతున్నారు. టీడీపీ హయాంలో చర్చిల నిర్మాణానికి నిధులు ఇచ్చేవాళ్ళం. కానీ, ఇప్పుడు వ్యక్తిగతంగా నిధులిస్తున్న ప్రభావం వారిపై ఉంటోంది. అది రాజకీయంగా మనకు నష్టం చేస్తోంది. క్రైస్తవ మందిరాల్లో ప్రార్థన చేసేవాళ్ళు టీడీపీ జెండా కట్టకూడదని కొందరు పాస్టర్లు ప్రబోధిస్తున్నారు. మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సబబు? మీరు దీని గురించి ఆలోచించాలి'' అని ఆయన బాబుకు సూచించారు. దీని వెనుక జగన్ కుట్ర ఉందని అక్కడి వారంతా మల్లగుల్లాలు పడ్డారు.

naidu_yatra
       కాగా టీడీపీ అధినేత దీనికి జవాబుగా,  "టన్నులకొద్దీ డబ్బులు పెట్టుకొన్న పార్టీలు వాటిని విరజిమ్మి ఎమ్మెల్యేలను కొంటున్నాయి. ఆ కొనుగోళ్లతో మన పాదయాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చవచ్చని భ్రమ పడుతున్నాయి. టీడీపీని చీల్చిన ఇందిరాగాంధీనే ఎదిరించి నిలబడ్డాం. టీడీపీ ఎంపీలను చీల్చినా.. నాటి ప్రధాని పీవీ 1994 ఎన్నికల్లో ఓటమిని తప్పించుకోలేక పోయారు. ప్రతీ సంక్షోభం టీడీపీని మరింత బలోపేతం చేసింది. పోయిన ఎమ్మెల్యేలు చరిత్రహీనులవుతారు తప్ప పార్టీకి ఏమీ కాదు. టీడీపీ కేడర్ పార్టీ. ఒక నాయకుడు పోతే పది మంది పుట్టుకొస్తారు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో జరిగిన టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన జగన్ పార్టీ మీద దుమ్మెత్తిపోశారు. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teenager bites off tongue of youth who tried to rape her
Revenue minister raghuveera reddy bhageeradha vijayatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles