Revenue minister raghuveera reddy bhageeradha vijayatra

revenue minister raghuveera reddy, minister raghu veera, raghu veera reddy, campaing, handriniva yatra, bhageeradha vijayatra, andhra pradesh state, politics, padayatras

revenue minister raghuveera reddy bhageeradha vijayatra

7.gif

Posted: 11/18/2012 01:12 PM IST
Revenue minister raghuveera reddy bhageeradha vijayatra

raghu_veera

హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు మొదటి పంపింగ్ స్టేషన్(పీఎస్)ను ఆదివారం సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించిన తర్వాత రెవెన్యూ శాఖమంత్రి ఎన్.రఘువీరారెడ్డి భగీరథ విజయాత్రకు స్వీకారం చుట్టారు. మల్యాల నుంచి కాలువ వెంట ప్రారంభమయిన ఈ యాత్ర ఈ నెల 29 వరకు సాగనుంది. జీడిపల్లె రిజర్వాయర్ వరకూ 216.3 కిలోమీటర్ల మేర 12 రోజుల పాటు రఘువీరా యాత్ర సాగించి అనంతపురానికి నీటిని నడిపించనున్నారు. భగీరథ విజయాత్రలో భాగంగా ఎనిమిది పంపింగ్ స్టేషన్ల వద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. సీఎం ప్రారంభించిన పీఎస్ కాకుండా తక్కిన ఏడు పీఎస్‌లను ఒక్కో మంత్రి ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
      దీంతో నాలుగు దశాబ్దాలుగా రాయలసీమ వాసులు కంటున్న కలలను ఈ ప్రాజెక్టు సాకారం చేయనుంది. మొదటి దశగా 216.3 కిలోమీటర్ల కాలువను, మూడు రిజర్వాయర్లు, ఎనిమిది పంపింగ్ స్టేషన్లను అధికారులు పూర్తి చేశారు. అందులో ఏడు పంపింగ్ స్టేషన్లు కర్నూలు జిల్లాలోనూ, అనంతపురం జిల్లా జీడిపల్లె వద్ద ఒక రిజర్వాయర్ నిర్మాణాలను పూర్తి చేశారు. హంద్రీనీవా మొదటి దశ ద్వారా కర్నూలు జిల్లాలోని 80 వేల ఎకరాలకు, అనంతపురం జిల్లాలోని లక్షా 18 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రెండు జిల్లాల్లో 120 గ్రామాలకు చెందిన సుమారు 10 లక్షల మందికి తాగు నీరందనుంది. ఎనిమిది పంపింగ్ స్టేషన్ల వద్ద తగిన సామర్థ్యంతో కేవీ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేశారు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu desam party leaders blame ys jagan
Cm at handriniva project kurnool today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles