Durga temple in vangaveeti radha

durga temple Eos fight, durga temple in vangaveeti radha, durga temple, vangaveeti radha krishna, ysr party, ysr congress party, ysrcp, vangaveeti radha entry in durga temple, vemuri radhakrishna , tdp leader, tdp ,

Durga temple in Vangaveeti Radha

Vangaveeti.gif

Posted: 11/07/2012 03:08 PM IST
Durga temple in vangaveeti radha

Durga temple in Vangaveeti Radha

దుర్గ గుడి ఈవో పేషీ వివాదం మరింత రచ్చకెక్కింది. ఈవో పేషీ తాళం చెవులు ఇవ్వనందుకు మంగళవారం ఇన్‌చార్జి ఈవో విష్ణు ప్రసాద్ పంచానామా చేసి తాళాలను పగులగొట్టారు. ఆ తర్వాత తన విధులను అడ్డుకున్నారని ఆయన ఈవో రఘునాథ్‌పై విజయవాడ వన్‌టౌన్ పీఎస్‌లో కేసు పెట్టారు.  ఈవో పేషీకి తాళం వేసి ఉండడంతో విష్ణు తాళం చెవుల కోసం సిబ్బందిని పంపించారు. రఘునాథ్ ఇవ్వలేదు. కాగా తాళాలు పగులగొట్టే విషయంలో ఒక అధికారి పంచనామా నిమిత్తం మాజీ కార్పొరేటర్ బుద్ద జగన్నాధాన్ని పిలవడంతో ఆయన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను తీసుకుని ఆలయానికి వచ్చారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వచ్చారు. ఈ సందర్భంలో విష్ణుప్రసాద్ పేషీ తాళాన్ని ఇప్పుడు తీయడానికి సమయం చాలదని, సాయంత్రం తీస్తానని చెప్పారు. దాంతో తమనెందుకు పిలవాలంటూ వంగవీటి రాధా, బుద్ధా జగన్నాథంలు ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌టీఎఫ్ పోలీసులు వారిని బయటకు వెళ్ళాలని తోయడంతో కొంత వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆలయ అధికారులు తమను పిలిచి అవమాన పరిచారని వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. ఇదే సమయంలో టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న కూడా ఆలయానికి చేరుకుని గుడిలో అవినీతి చిట్టాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. దాంతో పెద్దసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తరువాత విష్ణు ప్రసాద్, రఘునాథ్‌లు ఆలయానికి వచ్చారు. రఘునాథ్ లాంజ్‌లో కూర్చున్నారు. ఆయన వద్దకు ఎవరూ వెళ్ళకుండా పోలీసులు కాపలా ఉన్నారు. ఇదే సమయంలో విష్ణు ప్రసాద్ పేషీ తాళాలను బ్రేక్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young woman fails driving test 105 times
Sachidanand saraswathi swamiji fire on collector  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles