Tdp mla jump to other parties

TDP Leaders Jumping to YSRC and TRS Party. chittoor district praveen kumar reddy, adilabad district two mlas, harishwar reddy and venugopala chary

TDP Leaders Jumping to YSRC and TRS Party. chittoor district praveen kumar reddy, adilabad district two mlas, harishwar reddy and venugopala chary

TDP MLA jump to other parties.png

Posted: 10/30/2012 06:35 PM IST
Tdp mla jump to other parties

tdp_mlas

తెలుగు దేశం పార్టీకి పంచ్ ల మీద పంచ్ లు పడుతున్నాయి. ఆ పార్టీ నుండి సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు వలస బాట పడుతున్నారు. గత కొన్ని రోజుల నుండి వివిధ పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి, టీఆర్ఎస్ లోకి వలసలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఒక్క రోజే ఆ పార్టీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగు దేశం సీనియర్ నాయకుడు అయిన హరీశ్వర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే అయిన వేణుగోపాల చారి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారు. కెసిఆర్ స్వయంగా హరీశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి టిఆర్ఎస్ లో చేరవలసిందిగా ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ఆయన విందు సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈయనతో పాటు వేణుగోపాల చారి, నాగం కూడా ఆ పార్టీలో చేరే అకాశాలు ఉన్నాయి.  ఇక చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రదీద్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి చంచల్ గూడ జైలులో జగన్ ను కలిశారు.దీంతో ప్రవీణ్ ను టిడిపి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గా పార్టీ ప్రకటించింది. త్వరలో ఈయన వైయస్సార్ కాంగ్రెస్ లో చేరుతానని ప్రకటించారు. వీరి తండ్రి ఎమ్మెల్సీగా కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత హత్యకు గురి అయ్యారు. తదుపరి ఈయన తల్లి లక్ష్మీదేవమ్మ రెండుసార్లు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం ఇప్పుడు గత ఎన్నికలలో ఈయన గెలుపొందారు. ఇలా ఒక్కరోజే టీడీపీ పార్టీ నుండి ఇంత మంది వెళ్ళి పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే పరిగణించ వచ్చు. రానున్న కాలంలో ఇంకెందరు వెళ్ళిపోతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pilots fall asleep mid air
English medium student studies in guntur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles