Kidnapped baby sanvi dead

Kidnapped Baby Sanvi Dead, Raghu Yandamuri, Baby Sanvi Dead, Baby Sanvi Killed,Baby Sanvi Veena,sanvi kidnap case, saanvi venna murder investigation, Saanvi kidnaper Raghu, FBI investigation, Saanvi Venna Body found, press conference, Saanvi Venna body found, Saanvi Kidnapper Arrested, FBI Official Pressmeet, Saanvi Venna Parents, Saanvi Venna Relations, Yendamuri Raghunandan Software,

Kidnapped Baby Sanvi Dead

Sanvi.gif

Posted: 10/27/2012 10:39 AM IST
Kidnapped baby sanvi dead

Kidnapped Baby Sanvi Dead

చిన్నారి సాన్వి  క్షేమంగా తమ ఒడికి చేరుతుందని  ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి  చివరకు తీవ్ర విషాదమే మిగిలింది. స్వాన్నిని ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడన్న చేదువార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ముక్కు పచ్చలారని పదినెలల పసిపాప సాన్వి నూరేళ్ల జీవితాన్నిమానవ రూపంలో ఉన్న రాక్షసుడు చిదిమేశాడు. సంతోషంతో కళకళ్లాడుతున్న ఇంటిని శ్మశానంగా మార్చాడు. బంధువే హంతకుడవుతాడని సాన్వి కుటుంబం పసిగట్టలేకపోయింది. బంధువు రూపంలోనే నరరూప రాక్షసుడు ఉన్నాడనే సంకేతాలను శివ, లత దంపతులు తెలుసుకుని ఉంటే జన్మనిచ్చిన సాన్వికి నూరేళ్ల జీవితాన్ని ప్రసాదించేవారయ్యేవారు. ఐనా భగవంతుడికి ఇసుమంతైనా దయ, దాక్షిణ్యం, కరుణ లేకపోయాయి. పదినెలల చిన్నారి సాన్వి సజీవంగా తిరిగి వస్తే బాగుంటుందని చేసిన ప్రార్ధనలకు భగవంతుడి మనస్సుని కూడా కదిలించకలేక పోయింది. చివరికి వెన్నలాంటి సాన్వి చిరునవ్వు కూడా హంతకులను కరిగించలేకపోయింది. దాంతో గత కొద్ది రోజులుగా ప్రవాస భారతీయులనే కాకుండా, భారతీయులందర్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిన సాన్వి కిడ్నాప్ వ్యవహారం అత్యంత విషాదంగా ముగిసింది.

Kidnapped Baby Sanvi Dead

సాన్వి .. పట్టుమని పది నెలలైనా కాలేదు ఈ భూమి మీద పడి ! ఇంతలోనే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. అమాయకమైన ముఖం, మేలిమి బంగరు ఛాయ. చురుకైన కళ్లు. చూడగానే ఎంతో ముద్దొచ్చే ఆ చిన్నారిని ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. నాయనమ్మని హత్య చేసి పాపను అపహరించుకుపోయిన దుండగులు పాపను కూడా హత్య చేసి ఉంటారని ఎఫ్.బి.ఐ. సైతం ఊహించలేదు. పాపను ప్రాణాలతో కాపాడి తల్లిదండ్రులకు అప్పగించగలమనే ఎఫ్.బి.ఐ. ఈ నాలుగు రోజులూ విశ్వసించింది. కాని చివరికి పాప దక్కలేదు. పాప తల్లిదండ్రులు శివ ప్రసాద్, లత ఈ వార్త తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాని అందరి ఆశలూ శుక్రవారం ఉదయం ఆవిరైపోయాయి. పాప దారుణ హత్యకు గురైందని ఎఫ్.బి.ఐ. అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించేసరికి సభ్య సమాజం దిగ్భ్రాంతి చెందింది. పాప తల్లిదండ్రులతో పాటు అమెరికాలో ఉంటున్న తెలుగు కుటుంబాలన్నీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి.

Kidnapped Baby Sanvi Dead

శుక్రవారం సాయంత్రం అమెరికా నలుమూలలా తెలుగు కుటుంబాలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నాయి.ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు రఘు యండమూరి అని ఎఫ్.బి.ఐ. అధికారులు శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో వెల్లడించారు. సాన్వీని అపహరించుకుపోయిన ఈ వ్యక్తి కూడా కింగ్ ఆఫ్ ప్రష్యాలోని మార్కిస్ ఎపార్ట్‌మెంట్‌లోనే నివసిస్తున్నాడనీ, అతడు పాప నాయనమ్మను హత్య చేసిన అనంతరం చేతిరుమాలతో పాపకు ఊపిరి ఆడకుండా చేసి సూట్‌కేసులో ఇరికించేసి పాపను అపహరించుకుపోయినట్టు వెల్లడించారు.పాప గుండెమీదా, గొంతుపైనా కత్తిపోటు గుర్తులు ఉన్నట్టు ఎఫ్.బి.ఐ. వెల్లడించింది. పాపను అపహరించుకుపోయిన రఘు తనకు ఆ సాయంత్రానికే 50 వేల డాలర్లు చెల్లించాలంటూ ఒక లేఖను కూడా ఆ ఇంట్లో వదిలి వెళ్లాడని, అటువంటి లేఖలు పది ప్రతులు దొరికాయని ఎఫ్.బి.ఐ. అధికారులు వెల్లడించారు. పాప అపహరణ విషయం పోలీసులకు వెల్లడించవద్దన్న రఘు డబ్బు ఎప్పుడు, ఎలా చెల్లించాలో తమ మనుషులు చెబుతారని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. ఒక వేళ గనక పోలీసులకు పాప అపహరణ విషయం తెలియజేసినా, డబ్బు ఇవ్వకపోయినా పాపను ముక్కలు ముక్కలుగా చేసి ఇంటికి పంపిస్తానని కూడా రఘు యండమూరి ఆ లేఖలో పేర్కొన్నట్టు ఎఫ్.బి.ఐ. అధికారి వెల్లడించారు.

Kidnapped Baby Sanvi Dead

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr goes to gadwal to meet chandrababu
Chandrababu naidu falls from stage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles