Jairams toilet comment

Jairams, toilet, comment,Jairam Ramesh, Toilet, Temple

Jairam's toilet comment

Jairam.gif

Posted: 10/11/2012 12:01 PM IST
Jairams toilet comment

 Jairam's toilet comment

"పవిత్ర ఆలయాలను, హిందూ మతాన్ని కించపరుస్తూ కేంద్ర మం త్రి జైరామ్ రమేశ్ చేసిన వ్యాఖ్యలకు శిక్షగా.. ఢిల్లీలో ఒక రోజు ఆయనతో సులభ్ కాంప్లెక్స్‌లు (మరుగుదొడ్లు) కడిగించాలి'' అని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు స్వామి కమలానందభారతి ధ్వజమెత్తారు. నెల్లూరులోని శ్రీ రాఘవ కళ్యాణ మండపంలో జరిగిన 'సింహపురి అర్చక సింహగర్జన'లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేంద్రమంత్రి జై రామ్‌తో మరుగుదొడ్లు కడిగించడంపై తీర్మానాన్ని సభ ఆమోదించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలన్నారు. ఇందిరాగాంధీ స్వర్ణ దేవాలయంలోకి సైనికులను పంపి కాల్పులు జరిపిస్తే.. దాన్ని ఆపకుండా మౌనం వహించినందుకు అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌కు సిక్కు మతపెద్దలు స్వర్ణ దేవాలయంలో కరసేవ చేసి, చీపురుతో శుభ్రం చేసేలా శిక్ష విధించారని స్వామి గుర్తు చేశారు. అదే కోవలో జైరామ్‌కు శిక్ష విధించాలన్నారు. కేంద్రమంత్రి హిందూ మతవిశ్వాసాన్ని, ఆలయాలను కించపరిచినందుకు తగిన శిక్షను సింహగర్జనలో తీర్మానించాలని అర్చ క సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కేవీఎస్ఆర్ఎన్ ఆచార్యులు  కోరారు. ఈ సభ నిర్వహణకు ముందు నగరంలో అర్చకులు ప్రదర్శన నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dish tv trips on price war
Varla ramaiah demands sharmila sorry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles