Government of nigeria bans saree

Government Of Nigeria Bans saree

Government Of Nigeria Bans saree

Government Of Nigeria Bans saree.png

Posted: 08/27/2012 09:26 PM IST
Government of nigeria bans saree

Nigeria-leadyఫ్యాషన్ల మాయలో పడి సంప్రదాయ వస్త్రధారణ అయిన చీరకట్టు మన భారత దేశంలో రోజు రోజుకు మాయమై పోతోందే... అంటూ మన దేశంలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ ష్యాషన్లు వచ్చిన తరువాత చీర కట్టుకోవడానికి పాత తరం, కొత్త తరం అమ్మాయిలు అస్సలు ఇష్టపడటం లేదు. అలాంటిది నైజీరియాలో మాత్రం సాంప్రదాయ బద్దంగా చీర కట్టుకుంటానంటే మాత్రం ఆంక్షలు విధిస్తున్నారు. చీరకడితే నైజీరియా దేశంలో నేరం. చీర కడితే జైలు శిక్షా పడేలే కొత్తగా ఓ చట్టాన్ని తెస్తున్నారు అక్కడి పాలకులు. ఇది గనుక అమల్లోకి వస్తే.. నైజీరియా సంప్రదాయిక దుస్తులు ధరించే మహిళలకు జైలు శిక్ష విధిస్తారు. నాభి, వీపు కనబడేలా దస్తుల్ని ధరించడాన్ని నేరంగా పరిగణించి, మూడు నెలల జైలు శిక్ష లేదా వంద డాలర్ల జరిమానా విధించాలని ఈ చట్టంలో ప్రతిపాదించారు.

దీనిపై మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. కొత్త చట్టంలో చేసిన ప్రతిపాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆడవాళ్లను పొందటం కోసమే నాయకులు అవినీతికి పాల్పడుతున్నారనటం వారిలోని డొల్లతనానికి నిదర్శమేనంటూ మహిళా సంఘాలు ఆరోపించాయి.ముస్లిం మత సంస్థలు కూడా ఈ చట్టంలోని ప్రతిపాదనలకు మద్దతు తెలపడంతో మహిళా సంఘాలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహిళల వస్త్రదారణపై ఇలాంటి చట్టం తీసుకురావడంతో అక్కడ చర్చలు జరుగుతున్నాయి అందమైన మహిళల వ్యామోహంలో పడిన తమ దేశ రాజకీయ నాయకులు చాలామంది అవినీతికి పాల్పడుతున్నారని నైజీరియా సెనేటర్‌ ఎమీ యూఫోట్‌ ఎకాట్టీ చెప్పుకొస్తున్నారు. అందమైన మగువల కోసం తమ నాయకులు లండన్‌, రోమ్‌, న్యూయార్క్‌ దేశాలలో సౌందర్య సౌధాలు నిర్మించేందుకు కూడా వెనుకాడటం లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా నగ్నత్వం అవినీతికి దారితీస్తోందని వాపోతున్నారు ఆ సెనేటర్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Grilled meat increases the risk of diabetes
Shiridi sai baba laddus samples to lab  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles