Tdp mahadharna in vijayawada

tdp mahadharna in vijayawada

tdp mahadharna in vijayawada

3.gif

Posted: 08/26/2012 01:47 PM IST
Tdp mahadharna in vijayawada

      maha_dharna విజయవాడలో టీడీపీ చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కృష్ణా డెల్టాకు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన ధర్నాను...పోలీసులు భగ్నం చేశారు.  ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తాలన్న  టీడీపీ నేతల వ్యూహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి నేతలను అరెస్టు చేశారు. మరోవైపు టీడీపీ కావాలనే రాజకీయాలు చేస్తోందని..  విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్  విమర్శించారు. ప్రకాశం బ్యారేజ్  వద్ద ధర్నా నిర్వహించిన తరువాత బ్యారేజ్  గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీరు వదలాలని టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. టీడీపీ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు బ్యారేజ్  గేట్లకు వెళ్లే రహదారిని మొహరించారు. అంతేకాకుండా రోడ్డుకు అడ్డంగా కంచె వేశారు. మధ్యా హ్నం తరువాత దేశం నేతలంతా గేట్లు వేపు maha_dhar_eeeeeeదూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే టీడీపీ నేతల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.
     దీంతో టీడీపీ నేతలు, పోలీసులకు మద్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు టీడీపీ నేతలను అరెస్టు చేశారు. పోలీసుల అరెస్టులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నీరు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం వైదొలగాలని డిమాండ్ చేశారు. రైతులకు నీరిచ్చే వరకూ తమ ఉద్యమం ఆగదని టీడీపీ నేతలు హెచ్చరించారు. టీడీపీ చేపట్టిన ధర్నాకు రైతులు భారీగా తరలిరావడంతో నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి పోలీసులు కంచె వేసి రైతులను అడ్డుకున్నా భారీగా వచ్చారని ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని నేతలు అంటున్నారు. మహాధర్నా విజయవంతం కావడంతో దేశం నేతలు సంబరాల్లో మునిగిపోయారు. భవిష్యత్ లోనూ ఇదే విధంగా ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  23gif
Cell phone use could reduce sperm count  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles