Ysr congress party is trying for tdpcongress leaders

YSR Congress party is trying for KE brothers to take in to their party

YSR Congress party is trying for KE brothers to take in to their party

YSR Congress party is trying for TDP_Congress Leaders.png

Posted: 08/10/2012 04:48 PM IST
Ysr congress party is trying for tdpcongress leaders

YSR-Congressమొన్న జరిగిన ఉప ఎన్నికల తరువాత నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హడావుడి తగ్గింది. ఉప ఎన్నికల ముందు ఏ పార్టీ నేతలైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఈ మధ్యన ఆ పార్టీలోకి వలసలు తగ్గినా.... ఆ పార్టీ నేతలు మాత్రం ఇతర పార్టీల నేతలకు గాలం వేయకుండా మాత్రం ఉండటం లేదు. తెర వెనుక ఈ ప్రయత్నాలు బాగానే జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన నేతలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో లాగేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారట. కర్నూలు జిల్లాలో తెలుగు దేశం పార్టీకి చెందిన కెఈ బ్రదర్స్ సోదరులకు అక్కడ మంచి పట్టు ఉంది. వీరిని వైయస్సార్ పార్టీలోకి లాగడానికి అక్కడి నేతలు బేర సారాలు నడుపుతున్నట్లు వార్తలు.

ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరులలో జగన్ పార్టీ  మొన్న జరిగిన ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొందింది. ఈ ఊపులో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను జిల్లాలో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయేలా ప్రణాళికలు చేస్తున్నారట. మరోవైపు జిల్లాలోని కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. కెఈ బ్రదర్స్ మాత్రం జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడు జగన్ హవా నడుస్తుందని భావిస్తున్న పలువురు కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారట. టీడీపీ, కాంగ్రెస్ నేతలను పార్టీలోకి లాగడంలో వైయస్సార్ సీపీ ఏ మేరకు సఫలం అవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Neil armstrong has cardiac bypass surgery
Former haryana minister accused in geetika sharma suicide case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles