Presidential election ballot box

Presidential election ballot box, president of India,

Presidential election ballot box

election.gif

Posted: 07/18/2012 12:38 PM IST
Presidential election ballot box

ballot-box

 విమానంలో మనుషులకు మాత్రమే టికెట్ ఉంటుం ది. వారికి సీటూ ఉంటుంది.అదే సరుకుల విషయంలో చేతితో తీసుకెళ్లే లగేజీని ప్రత్యేక అరలో ఉంచుకోవచ్చు. పరిమితి దాటితే కార్గో ద్వారా తీసుకువెళ్లాల్సిందే. వా టికి ప్రత్యేకంగా సీటు ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ రూటే సెపరేటు. ఈ డబ్బాకు ప్రత్యేక హోదా ఉంటుంది. రాచమర్యాదలందుకుంటుంది. టికెట్ తీసుకుని దర్జాగా విమానమెక్కి ప్రత్యేక సీటులో కూర్చుంటుంది. పోలింగ్ బాక్స్ ఏమిటి.. దానికి ఈ మర్యాదలేమిటీ అనుకుంటున్నారా? అదేమరి. రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సుకు సీల్ వేస్తారు. రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారులు 20న దీనిని విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్తారు. ఈ ఇద్దరితో పాటు .. బాక్సూకూ టికెట్ తీసుకుంటారు. ఈ బాక్సును వారిద్దరి మధ్య ఉంచుతారు. మరో గమ్మత్తు ఏమిటంటే.. ఈ బాక్సుకు భద్రతా తనిఖీలనుంచి మినహాయింపు కూడా ఉందండోయ్! ఎంతైనా దేశ ప్ర«థమ పౌరుడిని నిర్ణయించే బాక్స్‌కదా.. ఆ మాత్రం మర్యాదలందుకోకపోతే ఎలా.. మీరే చెప్పండి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Beach volleyball sets up olympic fans
Psycho anthony in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles