Minister saraiah son sriman absconding

Minister Saraiah son Sriman absconding

Minister Saraiah son Sriman absconding

Minister Saraiah son Sriman absconding.gif

Posted: 07/14/2012 04:43 PM IST
Minister saraiah son sriman absconding

Srimanఈనెల 8న తేదీన పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్యతో కలిసి  వరంగల్ లో సుడిగాలి పర్యటన చేసిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం పూర్తయిన తర్వాత కార్యాలయం నుంచి మంత్రులు బయటికి వస్తుండగా కేయూ జాక్ విద్యార్థులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయించకుండా ఏం చేస్తున్నారని సారయ్యను నిలదీశారు. ఇదంతా ప్రత్యక్షంగా చూసిన మంత్రి కుమారుడు శ్రీమాన్ అదే రోజు సాయంత్రం మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులను పరుషపదజాలంతో దూషించాడు. తన ప్రవర్తనతో పోలీసుల విధులకు భంగం కల్గించాడు. దీంతో శ్రీమాన్‌పై కేసు నమోదు చేశారు.

ఇతని పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు అయింది. ఆ కేసు నమోదయ్యప్పటి నుండి శ్రీమాన్ పరారీలో ఉన్నాడు. శ్రీమాన్ ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ కూడా వేసుకున్నాడు. దీని పై విచారించిన  వరంగల్ రెండో అదనపు సెషన్స్ జడ్జి విజయసారథి ఆచార్యులు ఆ పిటీషన్ కొట్టి వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక బాధ్యాతాయుతమైన పోలీసు అధికారిని మాటలతో దూషించిన శ్రీమాన్ ని కఠినంగా శిక్షాలని ప్రజలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla bhikshapathi yadav in land grabbing scam
Kingfisher pilots go on strike40 flights cancelled  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles