Rahul gandhi has invited palvai goverdhan reddy

Rahul Gandhi, Palvai Govardhan Reddy, Sonia Gandhi, UPA, AICC, Congress, New Delhi,

Sonia Gandhi's son and AICC general secretary Rahul Gandhi has invited Palvai Goverdhan reddy to New Delhi. It is said that Rahul Gandhi may discuss on Telangana issue with Palvai Govardhan Reddy

Rahul Gandhi has invited Palvai Goverdhan reddy.gif

Posted: 07/03/2012 05:32 PM IST
Rahul gandhi has invited palvai goverdhan reddy

Goverdhan-reddyయూపీఏ ప్రభుత్వాన్ని కకలావికలం చేసి, కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న తెలంగాణ సమస్య పై ఓ పరిష్కారం ఆలోచించేపనిలో అధిష్టానం నిమగ్నమైందా ? త్వరలోనే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ పై స్పష్టమైన వైఖరి వెల్లడించబోతుందా ? అంటే ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే అవుననే అనుమానం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో పలువురు కేంద్రనాయకులు వివిధ ప్రాంతాల నేతలతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోనియాగాంధీ కూడా పలువురు ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కూడా తెలంగాణ అంశానికి ఓ పరిష్కారం కనుగోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

రాహుల్ గాంధీ ఈ మధ్యనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పాలమడుగు వెంకట్రావుతో సమావేశం నిర్వహించాడు. తాజాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ గోవర్ధన్‌రెడ్డి ఢిల్లీకి రావాల్సిందిగా ఫోన్ చేశారు. ఇప్పటికే తెలంగాణ ఎంపీలతో కూడా సమావేశం అయిన రాహుల్ ఈయనను కూడా ఢిల్లీకి రావాలన్నారు. రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కునే దిశగా చేస్తున్న ఆలోచనలో భాగంగానే రాహుల్ గాంధీ ఈ చర్చలు జరుపుతున్నారని రాజకీయ నాయకులు అంటున్నారు. మరి రాహుల్ ఈ సమస్యను పరిష్కరించడంలో ఎంత వరకు సఫలం అవుతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab nomination accepted
Central cabinet expansion in august first week  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles