Ms office 365 for education now free for educational institutes

MS Office 365 for Education now free for educational institutes,Microsoft Office 365 for Education, educational institutions, S. S. Mantha, the All-India Council for Technical Education, cloud-based suite, Microsoft Office desktop applications, Exchange Online, SharePoint Online, Lync Online,

MS Office 365 for Education now free for educational institutes

Office.gif

Posted: 07/03/2012 10:57 AM IST
Ms office 365 for education now free for educational institutes

MS Office 365 for Education now free for educational institutes

ఆర్ధిక సంక్షోభంలో ప్రపంచం అంతా కొట్టుమిట్టాడుతున్న తరుణంలో విద్యార్ధులు తమ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునేందుకు ఉచిత శిక్షణకు మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365ను రూపొందించినట్టు మైక్రోసాఫ్ట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆంథోని సాల్‌సిటో అన్నారు. ఎలాంటి ఆర్ధిక భారం లేకుండా విద్యార్ధులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బోధించేందుకు కూడా ఈ సాఫ్ట్‌వేర్ ప్రోటోకాల్‌లో అవకాశం ఉందని అన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రోడక్టివిటీ , కమ్యూనికేషన్, కొలాబ్రేషన్ అనుభూతిని అందించేదిగా ఈ సాఫ్ట్‌వేర్ ఇప్పటికే పేరొందిందని అన్నారు. మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365 అనేది క్లౌడ్ ఆధారిత సూట్ అని అన్నారు. ఇందులో సుపరిచితమైన మైక్రోసాఫ్ట్ ఆఫీసు డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఉంటాయని అన్నారు. దాంతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆన్‌లైన్, షేర్ పాయింట్ ఆన్‌లైన్, లింక్ ఆన్‌లైన్ కూడా ఉంటాయని అన్నారు. ఇ మెయిల్, క్యాలండర్, మైక్రోసాఫ్ట్ ఆఫీసు వెబ్ యాప్స్, వీడియో, ఆన్‌లైన్ మీటింగ్స్‌తో పాటుగా కరిక్యులమ్ ప్లానింగ్, స్టూడెంట్ ప్రాజెక్టులకు అడ్వాన్స్‌డ్ డాక్యుమెంటు క్రియేషన్ ఫీచర్స్ ఉంటాయని చెప్పారు. ఏ ఉపకరణంపై పనిచేస్తున్నా, క్లాస్ ప్రాజెక్టులను రియల్‌టైమ్‌లో కొలాబరేట్ చేసుకోవచ్చని , కరిక్యులమ్ క్రియేట్ చేసుకునేందుకు, ఆన్‌లైన్ టీచింగ్‌కు కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rail tax goes off track on mamatas red flag
High court serious on rave parties  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles