Jeevan reddy is joining in ysr congress

Jeevan Reddy is joining in YSR Congress

Jeevan Reddy is joining in YSR Congress

Jeevan Reddy is joining in YSR Congress.gif

Posted: 06/26/2012 07:13 PM IST
Jeevan reddy is joining in ysr congress

Jeevan-reddyకరీంనగర్ జిల్లాకి చెందిన రోడ్ల, భవనాల శాఖ మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకోసం లైన్ క్లియర్ అయినట్లు కూడా సమాచారం. దివందగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి మంచి మిత్రుడు అయిన జీవన్ రెడ్డి గత కొంత కాలంగా సొంత పార్టీ పై, ఆ పార్టీ నేతల పై విమర్శలు చేస్తువస్తున్నాడు. ఆయన కాంగ్రెసును తెలంగాణ విషయంలో టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు పార్టీ ఈ ప్రాంతంలో మనుగడ సాధించలేదని తొలుత విమర్శించిన జీవన్ రెడ్డి ఆ తర్వాత క్రమంగా తన మాటలకు పదను పెట్టారు. తాజాగా కాంగ్రెసు తెలంగాణ వ్యతిరేకి అని, ఈ పార్టీని ప్రజలు నమ్మడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జీవన్ రెడ్డి ఎప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పై, కాంగ్రెస్ నాయకుల పై విమర్శలు చేస్తున్నాడు కానీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై ఇంత వరకు విమర్శలు చేయలేదు. జీవన్ రెడ్డి జగన్ పార్టీలోకి ఎప్పుడో వెళుదామని అనుకున్నా, ప్రస్తుతం తెలంగాణ లో తెలంగాణ వాదం గట్టిగా ఉన్న తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ లో  చేరితే భవిష్యత్తు అందకారం అని భావించి చేరకుండా ఆగారని అంటున్నారు ఆయన అనుచరులు. అయితే తాజాగా పరకాల ఉప ఎన్నికల ఫలితాలు విశ్లేషించుకున్న జీవన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ లో చేరినా మిగతా వారికి గట్టి పోటీ ఇవ్వవచ్చనే భావనకు వచ్చి అందులో చేరడానికి సిద్ధమైనట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indias tallst family with a combined height of 26ft hopes to enter record book
Bjp considering change of karnataka cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles