Ram charan gets aston martin v8 vantage car as wedding gift

Ram Charan Gets Aston Martin V8 Vantage Car As Wedding Gift

Ram Charan Gets Aston Martin V8 Vantage Car As Wedding Gift

Martin.gif

Posted: 06/14/2012 11:12 AM IST
Ram charan gets aston martin v8 vantage car as wedding gift

Ram Charan Gets Aston Martin V8 Vantage Car As Wedding Gift

ఇప్పటికి వరకు ఎవరు ఊహించని గిప్ట్ చెర్రికి దక్కింది. ఈ గిప్ట్ తో  రామ్ చరణ్  ఇమేజ్ .. ఇంకా రెట్టింపు  అయ్యిందని  మెగా అభిమానులు  అంటున్నారు.  రామ్ చరణ్  మీద ప్రేమను ఈ గిఫ్ట్  ద్వారా వారు బయటకు తెలిపినట్లు తెలుస్తుంది.   అంత అరుదైన గిప్ట్ ఇచ్చింది ఎవరో తెలుసా? రామ్ చరణ్ కు స్వయన అత్త మామలు . తమ అల్లుడి కోసం  అరుదైన గిప్ట్ ఇచ్చినట్లు  తెలుస్తుంది. రామ్ చరణ్ కి ఆయన అత్తమామలు అరుదైన గిప్ట్ ఇచ్చి ఆనందపరిచారు. రూ.రెండుకోట్లు ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కారును అల్లుడికి బహూకరించారు. కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే వీలుండే ఈ కారు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. చరణ్‌ని పెళ్లి కొడుకుని చేసిన సందర్భంగా కారుని అందించారు. ఆస్టన్‌ మార్టన్‌ వాంటేజ్‌ వి8 మోడల్‌ కారు అది. గచ్చకాయ రంగులో ఉందా కారు. ఇందులో ఇద్దరు మాత్రమే కూర్చొనే వీలుంటుంది. స్పోర్ట్స్‌ కారు ఇది.

Ram Charan Gets Aston Martin V8 Vantage Car As Wedding Gift

జేమ్స్‌బాండ్‌ చిత్రం 'క్యాసినో రాయల్‌'లో బాండ్‌ ఈ బ్రాండ్‌ కారునే వినియోగించారు. ఈ తరహా కారు హైదరాబాద్‌లోనే మొదటిది కావటం విశేషం. రామ్‌చరణ్‌ వివాహ ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్‌ సి.రెడ్డి మనుమరాలు ఉపాసన మెడలో ఆయన గురువారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు తాళి కడతారు. వీరి వివాహానికి హైదరాబాద్‌ నగర శివార్లలో ఉపాసన కుటుంబీలకు ఉన్న వ్యవసాయ క్షేత్రం వేదికైంది. ప్రతాప్‌ సి.రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలోని సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో వివాహ ఏర్పాట్లను చేశారు. ఆ ప్రాంగణంలో సుమారు 5 వేల మంది అతిథులు ఆసీనులయ్యే వీలుంది. కల్యాణ మంటపాన్ని పచ్చటి తోరణాలతో అలంకరించారు. భారీ సెట్టింగులతో కల్యాణ వేదిక కనువిందు చేస్తోంది. కళ్లు చెదిరేలా విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. విదేశాల నుంచి తీసుకొచ్చిన పుష్పాలతో అలంకరించారు. వివాహానికి ఆహ్వానితులు మినహా ఇతరులు ఎవరూ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వివాహ ఆహ్వాన పత్రికతోపాటు లోపలికి వెళ్లేందుకు రహస్య సంకేతంగల కార్డులను అందజేశారు.

Ram Charan Gets Aston Martin V8 Vantage Car As Wedding Gift

రాంచరణ్‌తేజ-ఉపాసనల పెళ్లికి మెగా అభిమానులు ఎవరూ రావద్దని నాగేంద్రబాబు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెళ్లి జరిగే ఫామ్ హౌస్‌లోనే ఈ నెల 15వ తేదీన అభిమానుల కోసం ప్రత్యేకవిందు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఈ విందుకు అందుబాటులో ఉన్న ఐదువేలమంది అభిమానులకు ఆహ్వానపత్రికలు అందచేశామని, ఆహ్వానాలు ఉన్నవారే ఆ కార్యక్రమానికి రావాలని కోరారు. దూరప్రాంతాల నుంచి వచ్చే అభిమానులను ఫామ్‌హౌస్‌కు చేర్చేందుకు వివిధ ప్రాంతాల్లో బస్సులు ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana separate state soon kcr
Top stars grace ram charans marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles