Natural ways to lose stomach fat

Natural Ways to Lose Stomach Fat

Natural Ways to Lose Stomach Fat

Stomach.gif

Posted: 06/05/2012 06:31 PM IST
Natural ways to lose stomach fat

Natural Ways to Lose Stomach Fat

బొజ్జ పెరిగితే  చూడటానికి  ఎబ్బెట్టుగానే కాదు బోలెడన్ని ఆరోగ్య  సమస్యలు చుట్టుముడతాయి.  ఇక ఊబకాయుల్లోనైతే  ఇది గుండెపోటు  మూలంగా హఠాత్తుగా మరణించే అవకాశాలను  అధికం చేస్తున్నట్టు  మిన్నెసోటా  విశ్వవిద్యాలయం  పరిశోధకులు  గుర్తించారు.  ఈ మరణాల  విషయంలో  శరీర బరువు, ఎత్తు నిష్పత్తి (బీఎంఐ) కన్నా  తుంటి – నడుం చుట్టుకొలత  నిష్పత్తి మరింత ప్రమాధకరంగా పరిణమిస్తోందని  హెచ్చరిస్తున్నారు.  మధుమేహం, అధిక రక్తపోటు, గుండె రక్తనాళాల  సమస్య వంటి  ముప్పు కారకాలను తీసేసిన తర్వాత  కూడా గుండెపోటుతో  హఠాన్మరణాలకు పొట్ట  ముప్పు కారకంగా  మారుతున్నట్లు  తేలటం గమనార్హమంని  పరిశోధకులు  వివరిస్తున్నారు. 

Natural Ways to Lose Stomach Fat

గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొవ్వు పొట్ట వద్ద  పేరుకుపోవటమే దీనికి కారణమని  భావిస్తున్నారు.  ఈ కొవ్వు పెద్ద మొత్తంలో  వాపు కారకాలను శరీరం  లోకి పంపిస్తుందని  పరిశోధకులు  వివరిస్తున్నారు.  గుండె సమస్యలకు వాపు కారణమవుతుందన్న సంగతి తెలిసిందే. సాధారణంగా గుండెపోటు  ప్రాథమిక లక్షణాలు  కనిపించిన  తర్వాత  గంటలోపు  చనిపోతే దాన్ని హఠాన్మరణంగా  భావిస్తారు.  ఊబకాయంతో  పాటు  గుండె రక్త నాళ జబ్బు, గుండె లయ సమస్యలూ  దీనికి దోహదం చేస్తాయి.  తుంటి నడుం చుట్టుకొలత  నిష్పత్తిని  మెరుగు  పరచుకోవటానికి  ఊబకాయం  రాకుండా  చూసుకోవాలని  నిపుణులు  వివరిస్తున్నారు.  ఇందులో  వ్యాయామం  చాలా కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే  పండ్లు కూరగాయలు ఎక్కువగా  తీసుకోవటం వంటి జీవనశైలి మార్పులతో  జాగ్రత్త  పడటం  మేలని  సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan mohan reddy in jai
Water situation in delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles