Michelle prepared divorce papers to separate from obama

Michelle Obama,divorcing Barack Obama in 2000,Chicago,Barack Obama

According to a new book, Michelle Obama prepared divorce papers in 2000 following Barack Obama's disastrous attempt to win a House seat in Chicago

Michelle prepared divorce papers to separate from Obama.GIF

Posted: 05/17/2012 04:35 PM IST
Michelle prepared divorce papers to separate from obama

Michelleఅమెరికా అధ్యక్షుడు ఒబామా పెళ్ళి పెటాకులు అయ్యేదా ? అతని భార్య మిషెల్ అతనికి విడాకులు ఇచ్చేద్దామనే నిర్ణయానికి వచ్చిందా ? అంటే అవుననే అంటుంది ఆవిడ. ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంది ? అంటే అతనితో సుఖపడలేకనో లేక మరే ఇతర కారణాలతో కాదు. ఆమె చెప్పినట్లు విననందుకు విడాకులు ఇవ్వాలని అనుకున్నట్లు తాజాగా ఒబామా జీవితంపై విడుదల అయిన ‘ఎడ్వర్డ్ క్లెయిన్’ అనే రచయిత రాసిన ‘ద అమెచ్యూర్’ పుస్తకంలో ఈ వివరాలున్నాయి.  బరాక్ ఒబామా భార్య మిషెల్ 2000 సంవత్సరంలో భర్తకు విడాకులివ్వాలనుకున్నారని తాజాగా ఆ ఆ పుస్తకం బయటపెట్టింది.  ఆ ఏడాది ఎన్నికల్లో షికాగో స్థానం నుంచి ప్రతినిధుల సభకు పోటీ చేయొద్దన్న తన సలహాను ఒబామా పెడచెవిన పెట్టడంతో ఆమె కాపురాన్ని తెగతెంపులు చేసుకోవాలనుకున్నారని తెలిపింది. షికాగో స్థానం నుంచి నాలుగు సార్లు గెలిచిన బాబీ రష్‌పై పోటీ చేయొద్దని మిషల్ భర్తకు చెప్పారు. అయితే ఒబామా పట్టించుకోలేదు. నాటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒబామా బాగా కుంగిపోయారు.

అప్పుల్లో కూరుకుపోయారు.కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వలేకపోయారు. ఒక దశలో ఆయన ఆత్మహత్య చేసుకుంటాడేమోనని మిత్రులు ఆందోళనచెందారు. ఈ కష్టకాలంలో ఆయన ఓదార్పు కోసం భార్య చెంతకు చేరారు. అయితే తన మాట వినకపోవడంతో మిషెల్ ఆయనకు సాంత్వన ఇవ్వలేని స్థితిలో ఉండిపోయారు. ఈ దశలో వారి కాపురం కూలిపోయే పరిస్థితి వచ్చింది. విడాకుల గురించి మిషెల్, తాను మాట్లాడుకున్నామని ఒబామా స్నేహితులతో చెప్పారు. మిషెల్ విడాకుల పత్రాలు కూడా సిద్ధం చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ విభేదాలను పరిష్కరించుకున్నారు. 2005లో ఒబామా.. ఇలినాయ్ సెనేట్ స్థానం నుంచి గెలుపొంది భార్య నమ్మకాన్ని చూరగొన్నారు. తాము ఒడిదుడుకుల జీవితం గడిపామని, అయితే తిరిగి ఒకరికొకరం దగ్గరయ్యామని ఒబామా దంపతులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Start my web
Plains crash in pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles