Mothers day special story

mothers day special story

mothers day special story

30.gif

Posted: 05/13/2012 06:11 PM IST
Mothers day special story

      6 అమ్మ...! భాషకు అందని భావం.. పుడమిన వెలిసిన భగవత్ స్వరూపం. తన రక్తాన్ని స్తన్యంగా మార్చి బిడ్డ ఆకలి తీర్చినా.. బిడ్డ బుడిబుడి నడకల తప్పటడుగుల వేళ ఆప్యాయంగా మురిసిపోయినా.. విద్యతోపాటు లోకజ్ఞానాన్ని అలవరుస్తూ ఆదిగురువుగా మెరిసినా.. తల్లి ప్రేమతత్వానికి అసలు సాటే లేదన్నది జగద్వితం. ఓ మాటలో చెప్పాలంటే అమృతత్వానికి మారుపేరే అమ్మతత్వం.
నేటి అంతర్జాతీయ మాతృదినోత్సవాన  అనిర్వచనీయమైన అమ్మతత్వాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకుని అమ్మరుణం కొంతైనా తీర్చుకునేందుకు ఓ చిన్న అవకాశం... సృష్టికి మూలం అమ్మ.. సృష్టిలో క్షేత్రం అమ్మ.. దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడట.. కష్టం వచ్చినా కన్నీళ్లొచ్చినా గుర్తొచ్చేది అమ్మే.. 7అమ్మ ప్రేమ అమృతం లాంటిది. మనుషులకే కాదు జంతువులకు కూడా అమ్మంటే చెప్పలేని ప్రేమ.. విశ్వరహస్యాలను ఛేదించిన వాడైనా ఓ తల్లి కొడుకే. అమ్మ చనుబాలను అమృతంలా సృష్టించి మమకారాన్ని కలగలిపిన మమతల కోవెలగా అమ్మ ఒడిని మలిచి మనకు అందించాడు దేవుడు. అందుకే ఓ కవి అవతార పురుషుడైనా అణువంతే పుడతాడని తెలిపాడు.
       అమ్మలాలి పాటల్లోనే తొలి సరిగమలు పురుడు పోసుకుంటాయి. అమ్మ జోల పాటను మించిన పాట లేదు. అందుకే సంగీతం కూడా అమ్మకు దాసోహమే. యాంత్రక యుగంలో ప్రీ బర్త్ స్కూల్స్ వచ్చినా.. ప్రీ స్కూల్ గార్డెన్స్ వచ్చినా..  అమ్మ ప్రేమ పదిలమే. ఇంటర్నెట్ యుగంలో కూడా అమ్మతనంలో కమ్మదనాన్ని మరిచిపోలేదు. 8ఎందుకంటే బ్లాగులు, సోషల్ నెట్ వర్క్ సైట్లు, ఆన్ లైన్ కవిత్వ, సాహిత్య వెబ్ సైట్లలో అమ్మ కవిత్వానికే అగ్ర తాంబూలం. చాలా మంది తమ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ప్రొఫైల్ ఫోటోగా తల్లీ బిడ్డల ఫోటోలనే ఎంచుకంటారు.
      ఆమె చేసే సేవను పోలిక లేనిది. ఆ రుణం తీర్చుకోలేనిది. అమ్మ ప్రేమను గుర్తు చేసుకోడానికి ఓ రోజు పెట్టుకున్నారు పాశ్చాత్యులు. దానికి ముద్దుగా మదర్స్ డే అని పెట్టుకున్నారు. మాతృదినోత్సవం.. కానీ అమ్మ గుర్తుంచుకొనే రోజెందుకు. అమ్మను మర్చిపోతే కదా..! కష్టం వచ్చినా కన్నీళ్లొచ్చినా వచ్చే తొలి మాట అమ్మే కదా.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rtc volvo bus fire accdent
Cm kiran pcc chief botsa and minister kanna fire on jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles