Mp nama walk along with kcr

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Telugudesam Party MPs Nama Nageswara Rao and Ramesh Rathod walkout from Loksabha on wednesday along with Telangana Rastra Samithi MPs K Chandrasekhar Rao and Vijayasanthi

mp nama-walk-along-with-kcr.gif

Posted: 05/03/2012 11:42 AM IST
Mp nama walk along with kcr

tdp-and-trsతెలుగుదేశం పార్టీ కి – టీఆర్ఎస్ పార్టీకి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉన్న ఈ పార్టీలు ఢిల్లీలో మాత్రం భాయి భాయి అనుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ ఎంపీలు, టీఆర్ఎస్ ఎంపీలు కలిసి కేంద్రం పై నిప్పులు చెరిగారు. కేసీఆర్, విజయశాంతి, నామా నాగేశ్వర్ రావు, రమేష్ రాథోడ్ ఈ నలుగురు పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకొని తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు.

దీంతో ఉదయం పదకొండు గంటలకు ఒకసారి సభ వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కొద్దిసేపు ఆందోళన చేసిన ఇరు పార్టీల ఎంపీలు, అప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాకపోవటంతో మూకుమ్మడిగా వాకౌట్ చేశారు.కెసిఆర్, విజయశాంతి, రమేశ్ రాథోడ్‌లు వెల్‌లోకి ప్రవేశించి, ప్లకార్డులు పట్టుకుని, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నామా నాగేశ్వర రావు అయితే ముందు వరుసలోని సీట్ల వరకూ వెళ్లి ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎంత సేపటికీ ఎలాంటి స్పందనా లేకపోవటంతో స్పీకర్‌ను విజయశాంతి నిలదీశారు. తెలంగాణలో ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అవి ఆపేందుకు ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.

ఈ సమయంలో వీరికి ఎదురుగానే సోనియా గాంధీ కూర్చున్నారు.
ఒక పక్క విజయశాంతి, రాథోడ్‌లు నినాదాలు చేస్తుండగా, మరో పక్క కెసిఆర్, నామా నాగేశ్వర రావు మాట్లాడుకున్నారు. ఈ సమయంలో టిడిపి ఎంపి నామాతో కెసిఆర్.. ఇంకా ఎంత సేపు నిల్చుంటాం.. పద వాకౌట్ చేద్దాం అని చెప్పారు. కెసిఆర్ ప్రతిపాదనకు నామా అంగీకరించారు. దీంతో టిడిపి, టిఆర్ఎస్ ఎంపీలు కలిసి సభ నుండి వాకౌట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Donating body parts on facebook
Yuvraj doesnt want to be reminded about his illness again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles