India joins elite club test fires agni 5

Agni-5, agni, news, hindustan times, inter-continental ballistic missile, ICBM, Defence Research Development Organisation, DRDO

India today test fired Agni-5, the country's first long range inter-continental ballistic missile (ICBM) from Wheeler Island, off the Odisha coast

India joins elite club, test fires Agni-5.GIF

Posted: 04/19/2012 05:11 PM IST
India joins elite club test fires agni 5

Agni_5భారత అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన అగ్ని-5 ఖండాంతర క్షిపణి ప్రయోగం సక్సెస్ అయింది. ఈరోజు ఉదయం ఒడిశాలోని వీలర్ దీవుల్లో నుండి ప్రయోగించారు. దీనిని దేశీయ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. దీనిని 2014-15 సంవత్సరంలో భారత సైన్యానికి అందజేస్తారు. ఈ ప్రయోగం విజయంతో ఖండాంతర క్షిపణి ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరింది. ఇది వరకు ఈ జాబితాలో యుఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్, యుకే  అతి కొద్ది దేశాలు మాత్రమే ఉన్నాయి.

ఈ ప్రయోగాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. అబ్బురపరిచే అదనపు శక్తులు ఉన్న ఈ క్షిపణి ప్రయోగంపై సహజంగానే భారత్‌కు అనుకూల, వ్యతిరేక దేశాలు దృష్టి సారించాయి. రక్షణ, అంతరిక్ష రంగాలతో పాటు మరికొన్ని కీలక రంగాలకు చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్టు కోసం కఠోరంగా శ్రమించారు. నిర్ధేషించిన లక్ష్యాలపై పడి విధ్వంసం సృష్టించడం ఒక్కటే కాకుండా భారతదేశ రక్షణ అవసరాలకు తగ్గట్లుగా బహుముఖ సేవలను అందించగల అస్త్రంగా అగ్నిని శాస్త్రవేత్తలు మలిచారు. సుమారు యాభై టన్నుల బరువు, పదిహేడు మీటర్ల పొడవు ఉండే అగ్ని 5 క్షిపణి ఒక టన్ను బరువైన అణ్వస్త్రాలను మోసుకుపోతూ ఐదువేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.

క్షిపణి విజయవంతం కావడంతో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ శాస్త్రవేత్తలను అభినందించారు. అగ్ని -5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు. దేశానికి ఇదో చారిత్రాత్మక ఘట్టమని ఆయన పెర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Big b amitabh bachchan all set to host kbc 6
Stronger link between depression and stroke  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles