Janardhan reddy remand extended till april 13

Janardhan Reddy remand extended till April 13,Illegal Mining, Bellary, Obulapuram Mining Company, G Janardhana Reddy, Janardhana Reddy

Janardhan Reddy remand extended till April 13

Janardhan.gif

Posted: 04/05/2012 07:02 PM IST
Janardhan reddy remand extended till april 13

Janardhan Reddy remand extended till April 13

బెంగళూరు మీ సొంతూరు కదా! ఎలా ఉంది అని న్యాయమూర్తి అ డగ్గా, బెంగళూరు తాను పుట్టి పెరిగిన ఊరు కాదని గాలి బదులిచ్చారు. మీ బెంగళూరు ఎలా ఉంది?' అంటూ గాలి జనార్దన్‌రెడ్డిని సీబీఐ కోర్టు న్యాయమూర్తి అడిగారు. విచారణ సందర్భంగా నిందితుల ఆరోగ్యం గురించి ఆరాతీసే న్యాయమూర్తి 'గాలి' ఆరోగ్యం గురించి కూడా వాకబు చేశారు..

ఆరోగ్యం బాగానే ఉందన్నారు. అనంతరం ఆయన రిమాండ్‌ను 13 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఏఎంసీ కేసులో కర్ణాటక సీబీఐ పోలీసులు అరెస్టు చేయడంతో..'గాలి' ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే! ఓబుళాపురం కేసులో రిమాండ్ ముగియడంతో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనార్దనరెడ్డిని సీబీఐ కోర్టు న్యాయమూర్తి విచారించారు.

ఇదే కేసులో నిందితులుగా ఉన్న బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ రిమాండ్‌ను కూడా అదేరోజుదాకా పొడిగించారు. 'గాలి' అసిస్టెంట్ అలీఖాన్‌ను బెంగళూరు నుంచి నగరానికి రప్పించేందుకు పీటీ వారంటు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణను కోర్టు 10వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. జగతి కేసులో నిందితుడు విజయసాయిరెడ్డి గతంలో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు 9వ తేదీకి వాయిదా వేసింది. న్యాయవాదు లు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయాలని అభ్యర్థించగా జడ్జి ఆమోదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme serious on t acts in high court
Sam pitroda for president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles