Nasal spray vaccine that stops heart attacks

Nasal spray vaccine that stops heart attacks,vaccine, delivered, injection, nasal, spray, prevent, heart, attacks, scientists, discovered, drug, stimulates, body, rsquo, immune, produce, antibodies, disease, stopping, fat, building, arteries

Nasal spray vaccine that stops heart attacks

vaccine.gif

Posted: 04/02/2012 07:47 PM IST
Nasal spray vaccine that stops heart attacks

Nasal spray vaccine that stops heart attacks

వ్యాక్సిన్‌తో గుండెపోటుని అరికట్టవచ్చునని భారత సంతతి వ్యక్తితో కూడిన ఓ పరిశోధక బృందం వెల్లడించింది. ఇప్పటికే దీనిపై పరిశోధనలు జోరుగా సాగుతున్నాయని, మరో ఐదేళ్లలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని బృందం తెలిపింది. రక్త నాళాల్లో కొవ్వు పదార్థాలు చేరుకోవడం వల్ల గుండెకు సరఫరా అయ్యే రక్తంలో అవాంతరాలు ఏర్పడి, అది గుండె జబ్బులకు దారితీస్తుందని వివరించింది. బృందానికి నేతృత్వం వహిస్తున్న అమెరికాలోని సెడార్స్ సియాయ్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ ప్రెడిమన్ షా, స్వీడన్‌లోని ల్యూన్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ నీల్సన్ మాట్లాడుతూ, తాము చేస్తున్న పరిశోధనలు త్వరలోనే కొలిక్కి వస్తాయని పేర్కొన్నారు.

ఇమ్యునో విధానం వల్ల రక్త నాళాల్లోని కొవ్వును తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. చుంచెలుకలపై జరిపిన వ్యాక్సిన్ ప్రయోగాల్లో 60నుంచి 70 శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చాయని చెప్పారు. రక్తనాళాల్లో కొవ్వు ఫలకాలు పేరుకోవడాన్ని తగ్గించడంలో వ్యాక్సిన్ దోహదం చేసిందన్నారు. ‘సి.వి.ఎక్స్-210’గా పిలుస్తున్న వ్యాక్సిన్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని తెలిపారు. పూర్తిస్థాయి పరీక్షల అనంతరం వినియోగంలోకి వస్తుందని వారు చెప్పారు. కాగా, ‘సి.వి.ఎక్స్-210’లో వినియోగిస్తున్న పదార్థాలతోనే తయారు చేస్తున్న మరో వ్యాక్సిన్‌ను నాసికా రంధ్రాల్లో స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా రక్తంలోని కొవ్వును తగ్గించుకోవచ్చునని ప్రొఫెసర్ నీల్సన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fuego company car
Item girl alphonsa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles