Jagan become an inmate of chanchalguda

April 2 is the D day—a turning point in the State politics when it will be known if YSR’s heir and MP Jagan Mohan Reddy will be arrested or given a reprieve. April 2 is the day the CBI is scheduled for filing its charge-sheet against Jagan in the disproportionate assets case. The CBI joint director dashing to Delhi is construed as a move to decide on the fate of the YSR Congress leader who threatens to upset the Congress applecart in the State. And, this the Congress can never allow as it draws its parliamentary muscle mainly from Andhra Pradesh.

CBI files its charge-sheet against YS Jagan.gif

Posted: 03/29/2012 06:49 PM IST
Jagan become an inmate of chanchalguda

Jaganదివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారం ఎన్నో కీలక మలుపులు తిరిగి చివరి దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో వైయస్ జగన్ తో సహా అనేక మంది పేర్లను చేర్చుతూ... పోయిన సంవత్సరం ఆగష్టు 17న సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మెన్ విజయసాయిరెడ్డి అరెస్టు చేసి దాదాపు 3 నెలల కావస్తున్న నేపథ్యంలో దీని పై ఛార్జిషీటు రేపు కానీ ఏప్రిల్ 2న కానీ  దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వేళ రేపే దాఖలు చేస్తే రేపే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన విషయాల పై సీబీఐ జెడి వి.వి. లక్ష్మి నారాయణ ఢిల్లీకి వెళ్ళి చర్చలు కూడా జరిపారు.

గత కొన్ని రోజుల నుండి విచారణ జరుగుతున్న ఈ కేసులో ఇప్పటికే ఎందరో ఐఏఎస్ అధికారులను, బడా వ్యాపార వేత్తలను, రాజకీయ నాయకులను, మంత్రులను కూడా విచారించి అనేక కీలక ఆధారాలు సేకరించారు. మొన్నటికి మొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటన రమణను కూడా సీబీఐ అధికారులు విచారించారు. వైయస్ హయాంలో లబ్ది పొంది జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారి వివరాలను సీబీఐ సేకరించింది.

ఈ కేసు పై ఛార్జీ షీటు దాఖలు చేసిన వెంటనే చాలా కీలక వ్యక్తుల్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ కీలక వ్యక్తుల్లో జగన్ కూడా ఉండవచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. గతంలో శంషాబాద్ ఏయిర్ పోర్టులో అరెస్టు కోసం రెక్కీ నిర్వహించినా అధిష్టానం రెడ్ సిగ్నల్ వేయడంతో అది జరగలేదు. కానీ ఇప్పుడు జగన్ ని, అతనికి సంబంధించిన వారిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జోరందుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nandamuri taraka ramarao
Chili powder  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles