తెలంగాణా సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్న మరో మార్గం, ప్రత్యేక ప్యాకేజ్. 20000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ, త్వరలోనే అభివృద్ధి మండలి రాబోతోంది. ఇదింకా అధికారికంగా బయటకు రాలేదు కానీ దీనిమీద అప్పుడే తర్జనభర్జనలు మొదలయ్యాయి. ఇది స్వాగతించదగ్గ పరిణామమని జెసి దివాకర రెడ్డి అన్నారు. వెనకబడిన ప్రాంతం కాబట్టి తెలంగాణాకి అభివృద్ది సహాయంగా ఈ ఏర్పాటు చెయ్యటమైతే సబబే కానీ తనకింకా ఆ దిశగా సమాచారమేమీ లేదన్నారాయన.
తెరాస నాయకుడు హరీష్ రావు మాత్రం ఈ విషయంలో నిప్పులు చెరిగారు. ప్రత్యేక తెలంగాణా తప్ప మరేమీ ఒప్పుకునేది లేదని, ప్రభుత్వం తెలంగాణా ప్రజలతో ఆటలాడుకుంటున్నదని, తెలంగాణా విషయంలో జాప్యం చెయ్యటానికి కాంగ్లెస్ ఆడుతున్న ఇదో కొత్త నాటకమని, మండలీ వద్దు, ప్యాకేజ్ లూ వద్దు మాకు తెలంగాణా ఇవ్వండి చాలు అన్నారాయన. ఈరోజు మీడియా ప్రతినిధులతో సమావేశమైన హరీష్ రావు, మండలి పేరెత్తితే కాంగ్రెస్ కి ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా గల్లంతేనని అన్నారు. ఒకసారి శ్రీకృష్ణ కమిటీ అని, మరోసారి చిదంబరం ఆల్ పార్టీ మీటింగని, ప్రణబ్ ముఖర్జీతో ఒక కమిటీ, గులామ్ నబీ ఆజాద్ తో మంతనాలు, పూటకోమాటతో తెలంగాణా ప్రజల సెంటిమెంట్ తో చెలగాటమాడుతున్నారని హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more